జాబు రావాలంటే బాబు రావాలి… అధికారంలోకి వస్తే ఇంటికో జాబు… అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం లోకి వచ్చాక చేతులెత్తేసిందెవరు.
జాబు రాని వాళ్ళ అందరికీ నెలకు రెండు వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా అని మాటిచ్చి, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు సవాలక్ష కండిషన్లతో కేవలం కొంత మందికే 2 వేలు ఇచ్చి ఎన్నికల స్టంట్ చేసిందెవరు?
దావోస్ కి వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు తమ ఆస్థాన మీడియా లో డప్పు కొట్టిచ్చి నిరుద్యోగులను ఊరించి, చివరికి వంద కోట్ల పెట్టుబడులు కూడా సాధించలేక నిరుద్యోగులని మోసం చేసిందెవరు? ద్రోహం చేసిందెవరు?
వైజాగ్ లో పెట్టుబడులు సదస్సు అని, జీడిపప్పు వ్యాపారులకి, నారాయణ కాలేజ్ లలో అడ్మిషన్లు చేయించే బ్రోకర్లకు కోట్లు వేసి లక్షల కోట్ల MOU లు అంటూ నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది ఎవరు?
ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే మొత్తం ఐదేళ్లలో 30 వేల ఉద్యోగాల కి నోటిఫికేషన్లు ఇస్తే అందులో కొన్ని జగన్ ప్రభుత్వమే నియామక ప్రక్రియ పూర్తి చేసింది…
2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి లక్షా 30 వేల నియామకాలు ఏకకాలం లో చేసి చరిత్రలో ఎన్నడూ చూడని రిక్రూట్మెంట్ చేసింది..
బాబు హయాం లో ఒక్కసారి మాత్రమే గ్రూప్ 1 నియామకం పూర్తి అయింది ఎన్నికలకి నెల ముందు ఎన్నికల స్టంట్ లో భాగంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా, జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఆ ప్రక్రియ పూర్తి అయింది…
గతం లో బాబు హయాంలో 2.5 ఏళ్లు పట్టిన గ్రూప్ 1 నియామకాలు వైసీపీ ప్రభుత్వం లో కేవలం 9 నెలల్లోనే యూపీఎస్సీ కన్నా మెరుగ్గా అతి తక్కువ సమయం లో నే నియామకాలు పూర్తి చేసి ఘనత వచ్చింది…
60 వేల ఉద్యోగాలు వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాలు చేపట్టింది…
6000 పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది..
గ్రూప్ -2 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్-4 నియామకాలు చేసింది…
6000 టీచర్ పోస్ట్ లకు డీఎస్స్సీ విడుదల చేసింది…
ఇక ప్రైవేట్ ఉద్యోగాల కల్పన విషయానికి వస్తే… బాబు లా దావోస్ దొంగ MOU లు చేసుకునే పబ్లిసిటీ స్టంట్ లు ఏం లేకుండానే… గత మూడేళ్లుగా EoDB index లో మొదటి స్థానం లో నిలిచి, మొత్తం గా 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది అని సాక్ష్యాత్ GIS వెళ్లండించింది…
ఎవరు ద్రోహం చేసినట్లు బాబా ? జగనా?