కనీసం చేతికి వాచీ కూడా లేని చంద్రబాబు అవినీతి చేసాడా?? కుప్పలుతెప్పలుగా చేసాడు. నీ అవినీతిపై చర్చ జరగాలి అడిగిన వై.యస్ కి… సమాధానంగా సరే అని ఒప్పుకున్నాడు కూడా. అసెంబ్లీ వేదికగా రంగం సిద్ధమయింది. దానికోసం అసెంబ్లీ సమావేశాల్లో కొంత సమయం కూడా కేటాయించారు. బాబు సై అన్నారు, స్పీకర్ తన అనుమతులు కూడా ఇచ్చారు. తీరా ఆ సమయం రానే వచ్చింది. ఏం కేసు నుండైనా స్టే తెచ్చుకోగల బాబు అవినీతిపై చర్చ సమయంలో కూడా ఈ తెలివితేటలే వాడి చర్చని నిరవధికంగా వాయిదా వేయిస్తూ అయిదేళ్ళు ముఖ్యమంత్రి గా కొనసాగాడు.
ఇదంతా 1996 లో జరిగింది. అప్పటి సి.ఎల్.పి నాయకుడు పీ.జే.ఆర్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మీదా, పశుసంవర్ధక శాఖా మంత్రి అయిన వీరారెడ్డి మీదా అవినీతి ఆరోపణలు చేసారు. అవినీతి ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారనీ, రెండు ఎకరాలు కూడా లేని బాబుకి ఇప్పుడు రెండు వేల కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. కాబట్టి ముఖ్యమంత్రి అవినీతిపై చర్చ జరపాలని డిమాండ్ చేసారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది.
ఆ సమయంలోనే కడప ప్రెస్మీట్లో మాట్లాడుతూ వై.యస్.ఆర్ కూడా చంద్రబాబు అవినీతిపై ధ్వజమెత్తారు. శాసనసభలో అవినీతి గురించి చంద్రబాబు ప్రసంగాలు చేయడం దురదృష్టకరం అని అన్నారు. నిజాయితీ పై చర్చలు చేస్తున్న చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అసలు చంద్రబాబు అవినీతి ఆస్తులపై చర్చ జరపాలని కూడా చెప్పారు. “నీతులు తర్వాత ముందు ఆస్తులు చూపు” అని డిమాండ్ చేసారు. దానితో 1996 సెప్టెంబర్ 30న అవినీతిపై చర్చకు చంద్రబాబు ఒప్పుకున్నారు.
కానీ, బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజున జరగాల్సిన చర్చను, స్పీకర్ సహాయంతో చర్చ విస్తృతంగా జరగాలి అనే కుంటి సాకు ను చూపిస్తూ చంద్రబాబు చర్చను వాయిదా వేయించారు. ఇరవై ఏడేళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆ చర్చ జరగనే లేదు.