తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి దర్శకత్వంలో దుగ్గుబాటి పురందేశ్వరిభారతీయ జనతా పార్టీని పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ పార్టీ రంగు కషాయం నుంచి పచ్చకు మారిందా అనే రీతిలో ఆమె పనులున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో గ్యాంగ్ చేసే ఆరోపణలనే ఈ ఏపీ బీజేపీ చీఫ్ కొంతకాలంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన మాటల కారణంగా ప్రజల్లో చులకన అయినా పట్టించుకోవడం లేదు. బాబు కోసం మరింత డెడికేషన్‌తో పనిచేస్తున్నారు.
మొన్నటి వరకు ఏపీ బీజేపీకి సంబంధించి సోషల్ మీడియా పేజీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాధించిన విజయాలు, ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎక్కువగా ప్రచారం చేశారు. కానీ పురందేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టాక ఆ పేజీలు ఎల్లో రంగు పూసుకొన్నాయి. మోదీ, ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాల అనుకూల పోస్టులు బాగా తగ్గిపోయాయి. పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఆమె పూర్తిగా తన మనుషులతో నింపేశారు. వారు చంద్రబాబు, లోకేశ్, ఐటీడీపీ, జనసేన ఖాతాల్లో, పచ్చ పత్రికలు, మీడియాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వచ్చే క్లిప్పింగ్స్నే బీజేపీ ఫేస్బుక్, ట్విట్టర్ పేజీల్లో పోస్టు చేస్తున్నారు. పచ్చ గ్యాంగ్ ఎప్పుడూ నిజం చెప్పే అలవాటు లేదు. కాకి లెక్కలతో తప్పుడు ప్రచారాన్ని ప్రచురిస్తూ ఉంటుంది. వారికి జగన్‌ను తిట్టడమే పని. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ పురందేశ్వరి అదేమీ పట్టించుకోకుండా నిత్యం జగన్‌పై విషం కక్కుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు.
కొంతకాలంగా ఏపీ బీజేపీ సోషల్ మీడియా పేజీల్లో ఎక్కువగా ఈనాడు క్లిప్పింగ్స్ పెడుతూ అడ్డగోలు రాతలు రాస్తున్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, విడదల రజని, ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులపై ఎప్పుడూ టీడీపీ పెట్టే చెత్త పోస్టులు ఆదివారం బీజేపీ ఫేస్బుక్ పేజీలో దర్శనమిచ్చాయి. దీనిపై కమలం పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ ఆఫీస్ పంపే పోస్టులు పెడుతున్నారని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని పురందేశ్వరి చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శిస్తున్నారు. పొత్తు కుదరక ముందే ఆమె తీరు ఇలా ఉంటే.. ఒకవేళ కూటమిలో చేరితే ఏపీలో బీజేపీని తెలుగుదేశంలో కలిపేస్తారని భయపడుతున్నారు. మరి చిన్నమ్మా.. మజాకా..