కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని బాబు ఎలా రద్దు చేస్తారు ప్రజలకి తెలియజేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం బాబుకి కొత్త కాదని అభిప్రాయ పడ్డారు. అసలు మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందే అనే జ్ఞానం కూడా చంద్రబాబు దగ్గర లేకపోవడం శోచనీయమని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం ప్రతిపాదిస్తేనే ఆంధ్రప్రదేశ్ లో అమలు పరచడానికి వీలుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాలలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు సిద్ధంగా ఉన్నాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఉపయోగం లేకపోతే ఈ పన్నెండు రాష్ట్రాలు ఎందుకు సిద్ధపడతాయి అని ప్రశ్నించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ప్రచారంకి వచ్చిన బిజెపి అధినాయకత్వం నుంచి ఎందుకు ప్రజలకు స్పష్టతను ఇప్పించలేకపోయారని అడిగారు. వరుస పర్యటనలతో ఆంధ్రప్రదేశ్లో బిజెపి నేతలు ఉన్నప్పుడు బాబు ఏ కలుగులో దాక్కున్నాడని అడిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అసెంబ్లీలో మంచి చట్టమని అభివర్ణించిన వీరు తీరా ఎన్నికల సమయంలో ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి గాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఎలా రద్దు చేస్తారు అని ప్రశ్నించారు. 2014లో కూటమితో జతకట్టిన బాబు కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో ఎందుకు అమలు చేయించలేక పోయాడో ప్రజలకి వివరించాలని తెలిపారు. మోసగాడు చంద్రబాబుని ఎవరు నమ్మద్దని, రాష్ట్రం నుంచి చంద్రబాబుని తరిమికొట్టాల్సిన సమయం దగ్గర పడిందని ఈ సందర్భంగా శ్రీనివాస రావు అభిప్రాయ పడ్డాడు.