నిన్నా మొన్నటి వరకూ బాబుతో రాసుకుపూసుకు తిరిగిన సిపిఐ రామకృష్ణ హటాత్తుగా బాబు పై విమర్శల బానాలు ఎక్కు పెట్టారు. . బిజెపి ఏపీకి ఏమి ఇచ్చిందని ఎన్డీఏతో జతకట్టనున్నారు, కేవలం మీ స్వప్రయోజనాల కోసమేనా అంటూ నిలదీశారు రామకృష్ణ.
విభజిత ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ఏమి చేసిందని వాళ్ళతో చేతులు కలుపుతున్నారు . 2014 నుంచి 2019 వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ రాష్ట్రానికి ఏమి తీసుకొని వచ్చిందని ఎద్దేవా చేశారు . 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి సభలో మాట్లాడుతూ ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి పెడచెవిన పెట్టిన బీజేపీతో ఎలా జతకడుతున్నారు అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుతాయన్నారు.
2014లో టీడీపీ బీజేపీ ఇచ్చే హామీలకు తాను హామీ అని జనసేన అధ్యక్షుడు పలు సభలలో చెప్పాడు, వాటిని అమల పరచని బీజేపీని , టీడీపీని ఏనాడు ప్రశ్నించలేదు నేడు ఏ విధంగా వాళ్ళతో పొత్తులో ఉంటారు అని అడిగారు. ఇలాంటి హామీలు నెరవేర్చలేని వాళ్ళని రాష్ట్రము నుంచి తరిమి కొట్టాలి అని అన్నారు . కాగా రెండు రోజులు క్రితం పవన్ కళ్యాణ్ , చంద్రబాబు ఏర్పాటు చేసిన విధ్వంసం పుస్తకం లాంచ్ లో రామకృష్ణ కూడా పాల్గొన్నా విషయం విదితమే అంతలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇంతలో ఏమైందో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.