రోడ్ల నిర్మాణానికి కేవలం నాలుగేళ్లలోనే రూ.42,236.28 కోట్లు వెచ్చించిన జగన్ సర్కారు తాజాగా మరో రూ.1,120 కోట్లతో 3,448 కిలోమీటర్ల రోడ్లను పునరుద్ధరించనుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు అధ్వాన్నంగా మారాయి. అలాంటి రోడ్లను పునరుద్ధరించడంతో పాటు పలు రోడ్లకు మరమ్మతులు చేపట్టిన విషయం తెలిసిందే.
నూతన రహదారులు నిర్మిస్తూ రాష్ట్ర రహదారులకు సరికొత్త సొబగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం 3,448 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్దరించాలని నిర్ణయించింది. రూ.1,120 కోట్లను రహదారుల నిర్మాణానికి వెచ్చించనున్నారు. వీటిలో తీరప్రాంత జిల్లాల్లో రూ.768 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులతో 2,294 కి. మీ. మేర రోడ్లను పునరుద్ధరిస్తుండగా, తీరప్రాంతం లేని జిల్లాల్లో రూ.352 కోట్ల ఆర్ఎస్ఐడీఎఫ్ నిధులతో 1,154 కి.మీ. మేర పునరుద్ధరిస్తారు. వీటిలో 339 రోడ్లను ‘హై ప్రయారిటీ’ రోడ్లుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం.
గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రాష్ట్ర రహదారులను అధ్వాన్నంగా మార్చినా ప్రజల కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు మెరిసేటి రోడ్ల నిర్మాణానికి అత్యధిక నిధులు వెచ్చిస్తూ రోడ్లను పునరుద్ధరిస్తోన్న ముఖ్యమంత్రి జగన్ పనితీరును పలువురు ప్రశంసిస్తున్నారు.