మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఒక ఈవిఏం పగలగొడుతున్నట్టు నిన్నటి నుండీ టీడీపీ, ఒక వర్గ మీడియా ఒక వీడియో వైరల్ చేస్తున్న విషయం విదితమే. ఈ వీడియో ప్రచారం వెనక తీవ్ర కుట్ర కోణం ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు.
మాచర్ల ఎన్నికల్లో పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో మొత్తం 7 EVM బాక్సులు ధ్వంసం చేసినట్టు ఈసీ చెబుతుంది. అయితే మొత్తం 7 EVM లు పగలగొట్టిన వీడియోలు బయట పెట్టకుండా కేవలం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవిఏం పగలగొట్టిన వీడియో మాత్రమే ఎలా బయటకు వచ్చింది ఇది ఎవరి వైఫల్యం.
ఎమ్మెల్యే పగలగొట్టినట్టుగా చూపించబడుతున్న పాల్వాయి గేటు పోలింగ్ బూత్ కాకుండా మరో తుమృకోటలో 3 , ఒప్పిచర్లలో 2, జెట్టిపాలెంలో 1 చొప్పున ధ్వంసం అయిన ఈవిఏంల తాలూకా వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. సదరు వీడియోని లీక్ చేసింది ఈసీనా , పోలీస్ డిపార్ట్మెంటా, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూటమి నాయకుల సిఫార్సులతో పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున జరిగిన బదిలీలలో భాగంగా నియమితులైన ఎస్పీ బిందు మాధవ్, ఐజీ త్రిపాటి, కారంపూడి సీఐ నారాయణ స్వామిల పై టీడీపీకి అనుకూలంగా వ్యవహరించినట్టు, ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులకు పట్టున్న పలు గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి ఓటర్లకు అన్యాయం చేస్తూ వారి ఓటు వారిని వేసుకోనివ్వకుండా రిగ్గింగ్ చేసుకోవడానికి సహకరించినట్టు పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణాల పై కొందరు అధికారులు సస్పెండ్ అయ్యారు కూడా. ఈ వీడియో బయట పడటం వెనక కూడా ఇలాంటి ఉద్యోగుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొన్ని పోలింగ్ బూతుల్లో పచ్చి గుండాల్లా ఓటర్ల పై దాడి చేసిన, కొన్ని గ్రామాల్లో దళితుల కాలనీల పై పడి ఇళ్ల మీద దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ ఎన్నికల కమిషన్ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మిగతా ఆరు ఈవిఏంల ధ్వంసం వీడియోలు కానీ, బూతుల వద్ద దౌర్జన్యం చేసిన వీడియోలు కానీ, దళితుల ఇళ్ల పై దాడులు చేసి గాయపరిచిన వీడియో కానీ, చివరికి పాల్వాయి గేటు బూత్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పై రాళ్ళ దాడి చేసి ఆయన్ని గాయపరిచిన వీడియో కానీ, ఆయన కొడుకు తల పగిలేట్టు రాళ్ళతో కొట్టిన వీడియో పుటేజి కానీ బయటకు రాకుండా ఎమ్మెల్యే వీడియో ఒక్కటే బయటకి రావడం వెనక అదృశ్య హస్తం ఎవరిది.
వారికి తొత్తులుగా వ్యవహరించింది ఎవరు.?
నియోజకవర్గంలో పలు చోట్ల రిగ్గింగ్ జరుగుతుంటే సంబంధించిన అధికారులకు రిగ్గింగ్ జరుగుతుందని పదేపదే ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో పాల్వాయి గేటు గ్రామంలో ప్రతిపక్ష టీడీపీ పార్టీకి చెందిన ఒక సామజిక వర్గం వాళ్ళు మిగిలిన కులాల వాళ్లను ఓటింగ్ కు రానివ్వకుండా వచ్చిన అందర్నీ తన కళ్ళ ముందే కొడుతూ ఏకపక్షంగా బూత్ లో రిగ్గింగ్ చేసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చి వారి రాక కోసం అదే గ్రామంలో గంటకు పైగా వేచి ఉన్నా కూత వేటు దూరంలో ఉండి కూడా స్పందించని పోలీస్ అధికారుల ధోరణికి సహనం కోల్పోయి ఈవిఏం పగలగొట్టి నిరసన తెలియజేసిన ఒక్క వీడియో బయటకు వచ్చి మిగతా ఘటనల వీడియోల ఊసు లేకపోవడం కూటమి చేస్తున్న బలమైన కుట్ర తప్ప ఇంకొకటి కాదు.