పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే పవర్ స్టార్. రాజకీయాల్లోకి వచ్చ సరికి కన్ఫ్యూజన్ స్టార్‌గా మిగిలిపోయాడు. ఆయన జనసేన అనే పార్టీకి అధ్యక్షుడనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం సేనాని వేస్తున్న అడుగులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టడం కష్టమే అనిపిస్తోంది.
సేనానికి స్థిరత్వం లేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ ఉంది. ఆయన చేష్టలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. 2014లో పార్టీ పెడితే ఇంత వరకు పోటీ చేయడానికి తనకంటూ ఒక నియోజకవర్గం లేదు. ఎంపీనా.. ఎమ్మెల్యేనా అనే క్లారిటీ లేదు. వెతుకులాటతోనే సమయం వృథా చేస్తున్నారని అభిమానులు మదనపడుతున్నారు. తోటి సినీ నటుడు బాలకృష్ణ హిందూపురం నుంచే పోటీ చేస్తున్నారు. మూడోసారి బరిలో దిగడానికి రెడీ అయ్యారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను తీసుకుంటే మంగళగిరిలో ఓడిపోయినా మళ్లీ అదే సీటు తీసుకున్నాడు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ మాత్రం నిలకడ లేక తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు.
2014లో సేనాని పోటీకి దూరంగా ఉన్నారు. అయితే పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. చుట్టచూపుగా ఏపీకి వచ్చి వెళ్లేవారు. అందువల్ల తనకంటూ ఒక నియోజకవర్గం లేకుండా పోయింది. దీంతో భయపడి 2019లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. నీతి మాటలు బాగా చెప్పే పవన్∙ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. అప్పటి నుంచి మొదలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. ఓసారి ప్రజలకు సేవ చేయాలంటే పదవులు అవసరం లేదు. మంచి మనసు ఉంటే చాలన్నారు. మరోసారి సీఎం సీఎం అని అవరడం కాదు. అందుకోసం మీరేం చేశారో చెప్పండంటూ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు వైఎస్సార్సీపీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఓమారు అన్నారు. ఇటీవలైతే రెండు చోట్ల ఓడిపోతానని ముందే తెలుసని.. కానీ పోటీ చేశానని కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. గెలవకపోవడానికి కారణం మీరేనని అభిమానగణాన్ని తిట్టిపోసిన చరిత్ర పవన్‌ది. ఓటమిని హుందాగా స్వీకరించలేకపోయాడు.
2024 ఎన్నికలు వచ్చే సరికి పవన్ మారాడా అంటే లేదనే చెప్పాలి. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈసారి నియోజకవర్గాల కోసం వెతుకులాట మొదలైంది. మొదట భీమవరం అన్నారు. కారు కాకినాడ ఎంపీ అన్నారు. కానీ చివరికి పిఠాపురం అసెంబ్లీని ఎంచుకున్నాడు. సరే ఇక్కడైనా సిన్సియర్‌గా ప్రయత్నం చేయకుండా హ్యాండ్సప్ అనే పరిస్థితికి వచ్చేశాడు. పోటీ చేస్తున్నానని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ప్లేట్ తిప్పేశాడు. టీడీపీ ఇన్చార్జి వర్మ అడ్డం తిరగడం.. ఆయన సహకరిస్తారని నమ్మకం లేకపోవడం.. వైఎస్సార్సీపీ ఉన్నత విద్యావంతురాలికి సీటు ఇవ్వడం.. తదితర కారణాలతో బీజేపీ పెద్దలు కోరితే ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని తాజాగా ప్రకటించాడు. ఎన్నికలంటే ధైర్యం ఎదుర్కోవాలి. ప్రజలకు నచ్చజెప్పి ఓట్లు సంపాదించాలి. కానీ పవన్‌కు రిస్క్ తీసుకునే ఉద్ధేవమే లేనట్లుగా ఉంది.
పవన్ ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆయనకు ఎక్కడ పోటీ చేయాలి.. ఎంపీనా.. ఎమ్మెల్యేనా అనే విషయం మరో పార్టీ చెప్పడమేంటని కార్యకర్తలు బాధపడుతున్నారు. బరిలో నిలిచే విషయంలో తనకే క్లారిటీ లేదు. ఇక ప్రజలకు సంబంధించిన అనేక విషయాల్లో స్పష్టత ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాయకుడు గందరగోళంగా ఉండకూడదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు.. ఇది నా శాసనం అన్న వ్యక్తి చివరికి కన్ఫ్యూజన్ స్టార్‌గా మిగిలిపోయాడు. జగన్ మాత్రం స్పష్టమైన ఆలోచనలతో ఐదేళ్లు పాలించి.. మరోసారి గెలిచేందుకు ఎన్నికల రేసులో ముందంజలో ఉన్నారు.