కర్నూల్ ని న్యాయ రాజధాని చేస్తాను అన్న నేపథ్యంలో నేషనల్ లా యూనివర్శిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇక్కడ నిర్మించ తలపెట్టటం శుభ పరిణామం అని చెప్పవచ్చు. రేపు కర్నూలులో పర్యటించానున్న సీఎం జగన్ నేషనల్ లా యూనివర్శిటీకి భూమి పూజ నిర్వహించిన తర్వాత నంద్యాల జిల్లా బనగాన పల్లికి వెళ్తారు.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి . వైయస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా 15,000 చొప్పున 3 ఏళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయం అందిస్తుంది జగన్ ప్రభుత్వం. 4,39,068 మంది మహిళలుకు రెండు విడతల్లో దాదాపు 1300 కోట్ల రూపాయల లబ్ది పొందారు , ఇప్పటికే రెండు విడతలు పూర్తి చేసుకోని రేపు ఇచ్చే విడతతో జగన్ ఇచ్చిన హామీ పూర్తి అవుతుంది.
ఉదయం 9.30 కి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానం ద్వారా కర్నూల్ జిల్లా లో ని ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు అక్కడ నుంచి సీఎం కాన్వాయ్ ద్వారా నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని అది పూర్తి అయిన తర్వాత హెలికాప్టర్ ద్వారా బనగానపల్లి చేరుకొని అక్కడ ఈబీసీ నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు