రైతు వ్యతిరేక విధానాలతో చంద్రబాబు రైతుల వెన్ను విరిస్తే అధికారంలోకి రాగానే పలు సంచలనాత్మక నిర్ణయాలతో, సంస్కరణాత్మక పాలనతో రైతుకు అండగా ముఖ్యమంత్రి జగన్ నిలబడ్డారు. విత్తు నుండి విక్రయం వరకూ రైతన్నకు అడుగడుగునా తోడుగా నిలిచిన జగన్ ప్రభుత్వం రైతన్నకు ప్రతీ దశలో అండగా నిలబడింది.
ఏపీలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి అండగా ఉండేందుకు గతంలో లేని విధంగా సీఎం జగన్ ఒక సంస్కరణాత్మక నిర్ణయం తీసుకున్నారు. రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న జగన్ ఆలోచన రాష్ట్రంలో ఉన్న రైతన్నల భవిష్యత్తును సమూలంగా మార్చివేసింది. విత్తు నుండి విక్రయం వరకూ రైతులకు అనునిత్యం తోడుగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు అగ్రికల్చర్ ఆఫీసర్ ను నియమించింది. రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 53.53 లక్షల రైతులకు 33,300 కోట్లను పంపిణీ చేసింది.
అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తూనే, ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోయిన 22.85 లక్షల మంది రైతులకు 1,977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ సాయాన్ని జగన్ ప్రభుత్వం అందించింది. ఇటీవల సంభవించిన మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు 347.55 కోట్ల సాయం అందించి వారికి అండగా నిలబడింది. సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది. విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా అందిస్తోంది. ఆక్వారైతులకు కూడా విద్యుత్ సబ్సిడీ అందిస్తూ వారికి అండగా నిలబడింది.