రాజకీయాల్లో ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం అర్థంలేని ఆరోపణలు గుప్పించటం ఏమాత్రం వాస్తవం కాని తప్పుడు ప్రచారాలతో దాడి చేయడం, ఆయా వ్యక్తులపై ఉన్నవి లేనివి బురద జల్లుతూ వ్యక్తిత్వ హననానికి పూనుకోవటం నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ కోవలో తెలుగుదేశం పార్టీ నేతలు, టీడీపీ అధిష్టానం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. తమ అనుకూల ఎల్లో మీడియా, అనుబంధ సోషల్ మీడియా విభాగాలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ బట్ట కాల్చి నెత్తిన వేయటం తెలుగుదేశం పార్టీకి ఎల్లో మీడియాతో పెట్టిన విద్య.
ఇక విషయానికి వస్తే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలకు టిడిపి సోషల్ మీడియా విభాగాల అరాచకాలకు సాక్షాత్తు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తల్లి అయినటువంటి విజయమ్మ గారు కూడా బాధితురాలే.. గతంలో విశాఖలో విజయమ్మ గారు పోటీ చేసిన సందర్భంలో విజయమ్మ గెలిస్తే కడప సంస్కృతి విశాఖకు వస్తుందని, రౌడీయిజం తెస్తుందని, విశాఖ నగరం అల్ల కల్లోలం అవుతుందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎల్లో మీడియా, టిడిపి అనుబంధ సోషల్ మీడియా విభాగాలు అత్యంత దారుణంగా తప్పుడు ప్రచారాలతో హోరెత్తించాయి. ఈ ఎల్లో మీడియా దాడి ఒక విజయమ్మ గారికే పరిమితం కాలేదు. జగన్ ని అతని భార్యని పిల్లల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు.
అయితే కర్మ బూమరాంగ్ అన్నట్టు 2024 సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లిలో అసలు సిసలైన రౌడీయిజానికి తెరతీసాడు. అసలు రౌడీయిజం అంటే ఎలా ఉంటుందో గెలవకు ముందే అనకాపల్లి ప్రజలకు రుచి చూపిస్తున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా డిఆర్ఐ అధికారులు టైల్స్ షాప్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా బిజెపి నేత సీఎం రమేష్ తన అనుచరులతో అక్కడికి వచ్చి హల్చల్ చేశాడు. ఉన్న ఫలంగా తనిఖీలు ఆపివేళ్లకపోతే తన అక్కడి నుంచి కదిలేది లేదని నా సంగతి మీకు తెలియదు అని అధికారులపై దౌర్జన్యం చేశాడు.
విధి నిర్వహణకు అడ్డు రావద్దని డిఆర్ఐ అధికారులు చెప్పినా వినకుండా వారి చేతిలోని ఫైళ్లను బలవంతంగా లాక్కొని తనిఖీ అధికారులపై గుండాయిజం చలాయించాడు. దీనితో తనిఖీ అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేయడం తప్పనిసరి అయింది. అయితే ప్రశాంతంగా సాగిపోతున్న అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలోనే ఇలా చేస్తే ఇక రేపు గెలిస్తే బ్రతకనిస్తారా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవ్వరి మీదనైనా తప్పుడు ప్రచారాస్త్రాలతో విరుచుకుపడే ఎల్లో మీడియా టిడిపి అనుబంధ సోషల్ మీడియా దీనిపై ఏమంటుందో చూడాలి. కొంపదీసి సీఎం రమేష్ రాకతో ఉత్తరాంధ్రకి రామరాజ్యం వచ్చిందని అంటారా?