రోజూ రోజుకి భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో త్రాగు నీరుకే కష్టం అనేలా ఉన్న పరిస్థితిలో 6300 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేలా, కుప్పం పలమనేరు రెండు నియోజకవర్గాలోని 8 మండలాలకు చెందిన 2 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చేలా 697 కోట్ల వ్యయంతో చేపట్టిన 143 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ నెల 26న బ్రాంచ్ కెనాల్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
మెట్ట ప్రాంతం అయినా రాయలసీమకు కృష్ణా మిగులు జలాలు తీసుకొచ్చే విధంగా కర్నూల్ జిల్లాలోని హంద్రీ నదిని, చిత్తూరు జిల్లాలోని నీవ నదిని అనుసంధానం చేసేలా ప్రణాళికలు రచించి 1987లో అప్పటి ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు.శంకుస్థాపనకే పరిమితం అయిన ఆ ప్రాజెక్ట్ ను ఆ తర్వాత చంద్రబాబు 9 సంవత్సరాలు సీఎం గా చేసిన ఏ మాత్రం పట్టించుకోలేదు. 2004 లో సీఎం అయిన దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఆకాంక్షతో జలయజ్ఞం క్రింద హంద్రీ నీవా సుజలా స్రవంతి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని పనులను వేగవంతం చేశారు. 2007 సంవత్సరంలో పుంగునూర్ – కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ కు ఆమోద ముద్ర పడింది. ఆమోద ముద్ర పడిన తర్వాత పనులు వేగవంతంగా సాగుతున్న తరుణంలో వైఎస్ఆర్ అకాల మరణంతో పనులు ఆగిపోయాయి. 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు మొదటి రెండు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ను పెడ చెవిన పెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పనులు మొదలు అయినప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేదు, బిల్లులు కూడా పెండింగ్ పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. అలా ఆ ప్రాజెక్ట్ మళ్ళీ మూలాన పడిన నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదట పనులు చేసిన రిత్విక్ అనే సంస్థకు పెండింగ్ బిల్లులు చెల్లించి మిగిలిపోయిన 143 కిలోమీటర్ల కెనాల్ ను పూర్తి చేయమని కోరగా వాళ్ళు చేయకుండా ఒక ఏడాది పాటు వదిలేశారు. మిగిలిపోయిన ఈ కెనాల్ పనులకు మళ్ళీ కొత్తగా టెండర్ పిలిచి ఆర్ ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థకు పనులు దక్కించుకుంది. మొదట రెండు ఏళ్ళు కరోనాతో పనులు జరగకపోగ , కరోనా తగ్గుముఖం పట్టాక శరవేగంగా పనులు పూర్తి చేసుకుంది ఈ బ్రాంచ్ కెనాల్. ఎట్టకేలకే ఈ బ్రాంచ్ కెనాల్ పూర్తిచేసుకొని ఈ నెల 26న జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభంకానుంది.