సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం హైదరాబాద్‌కు వెళ్ళనున్నారు . ఈ రోజులు జరగనున్న తన సోదరి షర్మిల కుమారుడు వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరవుతారు. కొద్దిరోజుల క్రితం షర్మిల జగనను కలిసి వేడుకలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఆ తరువాత షర్మిల ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడటం, వెనువెంటనే తనయుని పెళ్లి పిలుపు పేరిట జగన్ రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్ లతో పాటు మరి కొందరితో భేటీ అయిన సందర్భంలో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 6.15 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగే నిశ్చితార్థ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు