సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి నా పెట్ ప్రాజెక్ట్ అని సీఎం జగన్ వెల్లడించారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే…ఆయన మాటల్లోనే..
ప్రతి స్కీమ్‌కు సంబంధించి డెప్త్ లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. మహిళలు.. నా అక్కచెల్లెమ్మలు.. వీళ్లకు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైయస్సార్ చేయూత. ఈ కార్యక్రమం ఇంతకు ముందు రూ.75 వేలు ఉండేది. నాలుగు దఫాలుగా ప్రతి అక్కచెల్లెమ్మకూ వైయస్సార్ చేయూత కింద,మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న నా అక్కచెల్లెమ్మలకు చేయి పట్టుకుని నడిపిస్తూ వాళ్లకు ఏదో ఒక ఆదాయం ఉండాలి, నిలదొక్కుకోవాలి, సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్లకు మరింత ఆదాయం సంపాదించుకునే పరిస్థితిలోకి పోవాలి. వాళ్లకు పెన్షన్ గానీ, చేయూత గానీ ఇలా ఏదో ఒక ఆదాయం వాళ్లకు ఉండాలి అనే ఉద్దేశంతో వైయస్సార్ చేయూతను కొనసాగిస్తున్నాం. ఇంతకు ముందు 5 ఏళ్లలో నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇచ్చాం. దాన్ని కొనసాగిస్తూ మళ్లీ రానున్న ఐదేళ్లలో నాలుగు దఫాల్లో కలిపి మొత్తంగా రూ.1.50 లక్షల దాకా అందిస్తాం. వాళ్లను మళ్లీ చేయి పట్టుకుని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది.
వైయస్సార్ కాపు నేస్తం.
ఇంతకు ముందు 4 దఫాల్లో రూ.60 వేలు ఇచ్చాం. మళ్లీ రానున్న ఐదేళ్లలో నాలుగు దఫాల్లోమరో రూ.60 వేలతో మొత్తంగా రూ.1.20 లక్షల వరకు అందిస్తాం.
వైయస్సార్ ఈబీసీ నేస్తం..
ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45 వేలు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ ఈ 5 ఏళ్లలో 4 దఫాల్లో మరో రూ.60 వేలు ఇస్తూ మొత్తంగా రూ.1.05 లక్షల వరకు అందిస్తాం.
జగనన్న అమ్మ ఒడి. ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్టు. అన్నీ నా పెట్ ప్రాజెక్టులే కానీ, ప్రజల కష్టాల నుంచి చూసి వారి బతుకులను బాగు పరచాలనే తపన, తాపత్రయం నుంచి బయటకొచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మ ఒడి అనేది పిల్లలకు సంబంధించినది కాబట్టి నా మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకు ముందు రూ.15 వేలు ఉండేది. రూ.13 వేలు నేరుగా అక్కచెల్లెమ్మల చేతికి ఇచ్చే పరిస్థితి. మరో రూ.2 వేలు వాళ్ల స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ల గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మ ఒడి రూ.15 వేలు కాస్తా రూ.17 వేలకు పెంచుతున్నాం. తల్లి చేతికే నేరుగా రూ.15 వేలు వస్తుంది. ఆ తర్వాత పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్ లో ఉన్న టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం మరో రూ.2 వేలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ దాని కోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మ ఒడి రూ.17 వేలు చేస్తూ తల్లి చేతికి రూ.15 వేలు ఇవ్వడం జరుగుతుంది.
వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా కింద రూ.25,571 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18 శాతం ఓవర్ డ్యూస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా మారి ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సీ గ్రేడ్, డీ గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన అక్కచెల్లెమ్మలను చేయిపట్టుకుని నడిపిస్తూ ఈ నాలుగు దఫాలుగా ఇచ్చే రూ.25,571 కోట్లు విజయవంతంగా పూర్తి చేసిన పరిస్థితులు. ఆ అక్కచెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ రూ.3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కొనసాగుతుంది.
వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా..
ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్లీ కొనసాగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగానే చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలో కూడా ఒక రీజన్, లాజిక్ ఉండాలి. అమ్మ ఒడి ఉంది. 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి. ఇప్పుడు కూడా జరుగుతోంది. యధావిధిగా ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. అదే విధంగా కల్యాణమస్తు, షాదీ తోఫా. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రతీదీ ఒక పర్పస్ ఉండాలి. చదువును ప్రోత్సహించేందుకు, చేయిపట్టుకుని నడిపించేందుకు, వాళ్లను వాళ్ల జీవితాల్లో ఎదిగేందుకు ఉపయోగపడేలా ప్రతి పథకమూ ఉండాలి.
పేదలందరికీ ఇళ్ల పట్టాలు..
ఇప్పటికే 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇప్పటికే అందులో 9.2 లక్షల ఇళ్లు పూర్తి కూడా అయిపోయాయి. మిగతావి వేగంగా పనులు జరుగుతున్నాయి.ఇది వచ్చే 5 ఏళ్లు కూడా కొనసాగుతుంది. అర్హులై ఉండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఇళ్లు కట్టడానికి ఆ 10 లక్షలు ఇంకా కొంచం ఎక్కువ వేసుకున్నా కూడా వాళ్లు ఇంకా అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్లకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది.
లబ్ధిదారుల సంఖ్య చూస్తే…
అసలు ఈ లబ్ధిదారుల సంఖ్య ఒకసారి చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్కచెల్లెమ్మలు.. 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది రూ.19,189 కోట్లు. కాపు నేస్తం ద్వారా ఏకంగా 4.63 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,030 కోట్లు. వైయస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.1,877 కోట్లు.
జగనన్న అమ్మ ఒడి ద్వారా దాదాపుగా 53 లక్షల మంది తల్లులకు ఇచ్చినది రూ.26,000 కోట్లు. వైయస్సార్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది రూ.4,969 కోట్లు. వైయస్సార్ ఆసరా ద్వారా మరో 79 లక్షల మందికి ఇచ్చింది రూ.25,571 కోట్లు. వైయస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా 56,000 మందికి ఇచ్చినది మరో రూ.427 కోట్లు. పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలం కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు, అందులో 22 లక్షల మందికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం జరుగుతోంది. ఇవి ఇంతకు ముందు నేను చెప్పిన వాటికి ఈ నంబర్స్ మిస్ అయ్యాయి. ఈ నంబర్స్ యాడ్ చేశాను.
పట్టణ గృహనిర్మాణం.
ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో ప్రత్యేకించి మిడిల్ ఇన్కమ్ గ్రూప్‌నకు సంబంధించి. దీనికోసం ప్రతి ఏటా రూ.1,000 కోట్లు కేటాయిస్తూ 2 సంవత్సరాల్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ ఎంఐజీ లే అవుట్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూపు ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే గవర్నమెంట్‌కు లాభం వేసుకోకుండా తక్కువ రేటుకే వాళ్లందరికీ కూడా ఈ ప్లాట్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని వల్ల టౌన్స్, సిటీస్ లో ఇటువంటి చోట మిడిల్ ఇన్ కమ్ గ్రూపులో ఉన్న వాళ్లందరికీ కూడా అధికారిక పట్టా, అధికారిక డాక్యుమెంట్స్ తో తక్కువ రేటుకు వీళ్లందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్ లో పట్టాలు అందుబాటులో ఉంటాయి.
పెన్షన్ల పెంపు.
అసలు ఈ పెన్షన్ల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలున్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు అంటే మార్చి 1 దాకా. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే రూ.1,000. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్. పెన్షన్ సొమ్ము రూ.3 వేలు. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది రూ.24 వేల కోట్లు.
చాలా ముఖ్యమైన విషయం.
చాలా ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత రూ.3 వేలు ఇస్తున్న రాష్ట్రంగానీ, జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం గానీ దేశంలో ఏదీ లేదు. ఇలా సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తుంటే హయ్యస్ట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణలో ఎంతో తెలుసా? కేవలం 43 లక్షల మంది పెన్షన్ అమౌంట్ రూ.2 వేలు, ఖర్చు చేసేది సంవత్సరానికి రూ.12,230 కోట్లు. ఉత్తర ప్రదేశ్ లో పెన్షన్ అమౌంట్ రూ.1,000, ఇచ్చేది 80 లక్షల మందికి, ఖర్చు చేసేది రూ.9,592 కోట్లు. రాజస్థాన్ లో పెన్షన్ అమౌంట్ రూ.750, ఇచ్చేది 90 లక్షల మందికి, జనాభా 8.31 కోట్లు, మన జనాభా 5.10 కోట్లు. రూ.8,114 కోట్లు వాళ్లు సంవత్సరానికి ఖర్చు.
కేరళలో వాళ్లు రూ.1,600 ఇస్తున్నారు నెలకు. 48 లక్షల మందికి ఇస్తున్నారు. రూ.7,295 కోట్లు. దేశం కన్నా మనం ఎంత పైనున్నామో ఒక్కసారి గమనించాలి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే.. జగన్ కు మనసు, మానవత్వం ఉన్నాయి. అవ్వాతాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవరూ చూపించలేదు, చూపించబోరు. ఎందుకు చెబుతున్నానంటే.. పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా రూ.3,500కు పెంచుతాం. రూ.250 పెరిగేది జనవరి 2028. ఇంకో రూ.250 పెరిగేది జనవరి 2029. డేట్లతో సహా ఎందుకు చెబుతున్నానంటే కల్మషం లేదు నాలో. అబద్ధం చెప్పదల్చుకోలేదు. మోసం చేయదల్చుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్టు చేయాలి. సపోర్టు చేయగలిగినప్పుడే పెన్షన్లు మనం ఇవ్వగలుగుతాం. ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం. లేకపోతే చేయనుకూడా చేయలేం. రూ.250 పెరిగిందంటే దాదాపుగా దాని కాస్ట్ రూ.2000 కోట్లు పైచిలుకు పడుతుంది. మరో రూ.250 పెరిగిందంటే దాని కాస్ట్ రూ.4,000 కోట్లు ప్రతి సంవత్సరం.
సపోర్ట్ చేసేపరిస్థితులు ఉండాలి. కుదుట పడి, ఇప్పుడు చేస్తున్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుట పడి, మళ్లీ కొద్దోగొప్పో వెసులుబాటును మళ్లీ వచ్చి కొద్దో గొప్పో వెసులుబాటును నేను మళ్లీ అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో, మళ్లీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడంటే అదీ లాస్ట్ 2 సంవత్సరాల్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఈ నంబర్లు కూడా అప్పుడు ఇస్తాను అని ఖచ్చితంగా చెబుతున్నానని సీఎం జగన్ స్పష్టం చేశారు.