తాను ప్రజలకు మంచి చేయకపోగా జరిగే మంచి మీద, దాన్ని చేసే వ్యక్తుల మీద బురద జల్లడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య.. ముఖ్యంగా పేదవాడికి మేలు జరుగుతుంది అంటే అస్సలు ఓర్వలేడు చంద్రబాబు.. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుండి నేటి వరకు ప్రజలకు మేలు జరిగే ఏ ఒక్క కార్యక్రమం ప్రవేశపెట్టినా చంద్రబాబు అడ్డుపడుతూనే ఉన్నాడు. తన ఎల్లో మీడియా, ఐటిడీపీ, అనుబంద విభాగాల ద్వారా వాటిపై బురద జల్లుతూనే ఉన్నాడు.
అందులో భాగంగానే ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తన అనుకూల మీడియా అనుబంధ విభాగాలను అడ్డుపెట్టుకుని ఉన్నవి లేనివి కల్పించి చిలవలు పలువల చేసి ప్రజల మనసుల్లో అపోహలు సృష్టిస్తూ తనదైన మార్క్ నీచ రాజకీయానికి తెరలేపాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ రాష్ట్ర ప్రజల భూములను కాజేస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఫోన్ కాల్స్ ద్వారా సోషల్ మీడియా విభాగాల ద్వారా తనకు అనుకూలమైన ఎల్లో మీడియా ద్వారా ఇదే తప్పుడు ప్రచారాన్ని బట్ట కాల్చి మీద వేసిన చందాన చేసుకుంటూ పోతున్నాడు.
అయితే ఈ విషయంపై సీఎం జగన్ మాట్లాడుతూ నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకు రైతులకు ఉపయోగపడేటువంటి అంశం. వందేళ్ళ క్రితం బ్రిటిష్ వారి పాలనలో జరిగిన సర్వే తప్ప ఇప్పటిదాకా ఆయా భూములు పై ఎలాంటి సర్వేలు జరగలేదు. భూములు కొలతల విషయంలో యజమానుల మధ్య ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారము దొరకలేదు. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి? కొన్నేళ్లుగా భూ వివాదాల మధ్య నలిగిపోతున్న ఆ భూస్వాములకు లేదా రైతులకు లేదా ప్రజలకు వారి భూములపై సర్వహక్కులు కల్పిస్తూ స్వేచ్ఛగా వారి స్వార్జితాన్ని అమ్మకాలు కొనుగోళ్లు చేసుకోవడానికి వీలుగా వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడానికి తీసుకువచ్చిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెలిపారు.
జగన్ ఎలాంటి వాడో జగన్ అంటే ఏంటో నీకు తెలియకపోయినా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబూ అంటూ ఎద్దేవా చేశారు. జగన్ భూములు ఇచ్చేవాడే గాని నీ మాదిరిగా ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కునేవాడు కాదు అని చంద్రబాబుని సూటిగా తూర్పారబట్టారు. ప్రజలకు మంచి జరిగే ఇలాంటి కార్యక్రమాలకు సాధ్యమైతే సహకరించాలని గానీ, పని కట్టుకుని బురద జల్లుతూ ప్రజలకు జరిగే మంచిని దూరం చేయకూడదు అని హితవు పలికారు. అసలు పేదవాళ్ళకి మేలు జరుగుతుంది అంటే చంద్రబాబు ఎందుకింత అసహనానికి గురవుతాడు అని ప్రశ్నించారు. అందుకే ఇది రాజకీయ పార్టీల మధ్య పోటీ కాదు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని తెలిపారు.