మేమంతా సిద్ధం యాత్ర లో భాగం గా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ చేత వెంకటాచలంపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద
రాజశ్యామల సహస్ర చండీయాగ సంకల్పం చేయించి, అనంతరం వేద ఆశీర్వచనం వేద పండితులు అందించారు..
రాష్ట్ర భవిష్యత్తు కోసం, సీఎం జగన్ కు మరోసారి విజయం చేకూరాలని శివరామప్రసాదశర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మలు 41 రోజుల పాటు రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించనున్నారు..
ప్రజాహిత పాలన చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ అరిమండ వరప్రసాదరెడ్డి, పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో వేద పండితులు శివప్రసాదశర్మ, నాగేంద్రశర్మలు ఈ యాగ క్రతువును నిర్వహించనున్నారు…
అసలేమిటి ఈ రాజశ్యామల యాగం:
దశ మహా విద్య లలో ఒక విద్య అయిన వారు మాతంగి. ఆ మాతంగికి మరోపేరు రాజశ్యామల. రాజరాజేశ్వరి దేవిని రాజశ్యామలగా పిలుస్తారు. మధురై లోని మీనాక్షి అమ్మవారు కూడా రాజశ్యామల రూపంగా పండితులు భావిస్తారు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు పొందటానికి చేసే యాగమే ఈ రాజశ్యామల యాగం. మూడులోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సాక్ష్యాత్ శ్రీమహావిష్ణువు కూడా రాజశ్యామల యాగం చేశాడని పురాణాలు చెబుతున్నాయి..
అయితే ఈ యాగం ఫలించాలి అంటే ఎవరైతే చేస్తున్నారో వారి జన్మ నక్షత్రం బాగుండాలి. సీఎం జగన్ యొక్క జన్మ నక్షత్రం దీనికి అనుకూలం అని పండితుల భావన. ఈ యాగం చేయడం వలన వైరిపక్షం బలహీన పడుతుంది, శత్రువు ఎంత బలవంతుడు అయినా వారు బలహీనం గా మారతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ యాగం రెండు పద్దతులలో నిర్వహిస్తారు.
వామాచారం ప్రకారం నిర్వహించే ఈ యాగాన్ని గతంలో యుద్దాలకు వెళ్లే ముందు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డి రాజులు కూడా నిర్వహించేవారని చరిత్ర చెబుతుంది. గతంలో కూడా సీఎం జగన్ ఈ యాగం నిర్వహించగా ఇది రెండవ సారి