తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్టీ రీజనల్ కో ఆర్డీనేటర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని గొప్పగా చాటి చెప్పిన సీఎం జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికలకు ఇంకో 45 రోజుల సమయమున్న నేపథ్యంలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా సీఎం జగన్ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఈ సమావేశంలో బస్సు యాత్ర రూట్ మ్యాప్‌తో పాటు మేనిఫెస్టో రూపకల్పన వంటి అంశాలపై సీఎం జగన్ చర్చను నిర్వహిస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు సీఎం జగన్ ప్రజల్లో ఉండనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కార్యచరణపై పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. బస్సు యాత్ర అనంతరం ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.
కాగా సీఎం జగన్ ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు ధైర్యం లేని టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. కాగా మూడు పార్టీలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోనున్న నేపథ్యంలో ఎన్నికల్లో సమాయత్తం కావడానికి సీఎం జగన్ తాజాగా రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలో మేనిఫెస్టోను కూడా విడుదల చేయనుంది.