2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 3 సార్లు సర్వే చేపించుకున్నట్టు బోగట్టా. సరే ఎక్కడ నుంచి పోటీ చేయాలి అనేది పవన్ కళ్యాణ్ ఇష్టం కానీ రాజకీయాలలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా ఒక నియోజక వర్గాన్ని అంటి పెట్టుకోకుండా ఎలక్షన్ ముందు ఈ వెతుకులాట ఎందుకు. 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేశాడు. ఎన్నికల ముందు ఒకరోజు ఉన్నింది లేదు ఎన్నికల ఓటమి తర్వాత అక్కడకి వెళ్లి వల్ల సమస్యలు తెలుసుకుంది లేదు, ఇహ ప్రజలకి నమ్మకం ఏర్పడేది ఎప్పుడు.నిన్ను నమ్మి ఓట్లు ఎందుకు వేయాలి అనే దానికి జవాబు మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గర ఉండదు.
పిఠాపురంలో అసలు ఎందుకు పోటీ చేయాలి అనుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాపు ఓట్లు 91000 ఉన్నాయి, తన సామాజిక వర్గం వాళ్ళు అందురు తనకే ఓటు వేస్తారు ఎమ్మెల్యే అవ్వచ్చు అనే అంచనా, అంతకుమించి పిఠాపురంలో పోటీ చేయడానికి వేరే ఆలోచన లేదు. గతంలో భీమవరం లో పోటీ చేసిన అంతే , గాజువాక లో పోటీ చేసిన అంతే సామాజిక వర్గమే మొదటి ప్రాధాన్యత. రాయలసీమ పై అంత ప్రేమ వెళ్లగక్కే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ ఎందుకు చేయలేక ఉన్నాడు. పిఠాపురంలో 4 ఎకరాలు భూమిని 2 నెలలు పాటు లీజుకు తీసుకొని హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ఏ రోటీ కాడ పాట ఆ రోటికాడ పాడుతూ అవసరం తీరలేదని అలిగి మరో కొత్త రోటిని వెతుక్కోవడం సేనానికి పరిపాటి అయిపోయింది.