టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మహాసేన రాజేష్ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కంటే సీఎం జగన్ బెటర్ అంటూ కొత్త రాగం అందుకున్నాడు. దీంతో కూటమి నేతలు అయోమయంలో పడ్డారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో మహాసేన రాజేష్ రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. తాజాగా ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కంటే జగన్ బెటర్ అంటూ రాసుకొచ్చిన ఆయన జనసేన ఓటమికి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ గారికి మా మద్దత్తు ఉపశంహరించుకుంటున్నాం..
పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది..
వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్..
కులం మతం పేరుతో అమాయకులపై దాడిచేసేవారు ఎవరైనా సరే వారికీ వ్యతిరేకం గా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు..
పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్ధాలు ప్రజలకు తెలియజేస్తాం..
ఇప్పటికే చాలా సహించాం..
జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోను ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తాం..
మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు.. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం..
పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం.
పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనపుడు మేము కూడా నిలకడగా ఉండలేము…
జై భీమ్.. అంటూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు.
2019 ఎన్నికల్లో వైసీపీని సపోర్ట్ చేసిన మహాసేన రాజేష్ అనంతరం వైసీపీకి ఎదురుతిరిగారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు రాజేష్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం సీటు కేటాయించారు. కానీ రాజేష్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరగడంతో రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నారు.. దాంతో పి.గన్నవరం సీటు జనసేనకు దక్కింది. కాగా జనసేన వల్లే తనకు అవమానాలు జరుగుతున్నాయని భావించిన మహాసేన రాజేష్ జనసేన అభ్యర్థుల ఓటమికి కృషి చేస్తానని చెప్పుకురావడం ఇప్పుడు కూటమికి పెద్ద తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు..