‘ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో.. సంక్షేమ పథకాలు చెప్పారో.. అవన్నీ అమలు చేసి చూపించారు జగనన్న. గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా మాట మీద నిలబడ్డారు’ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో అవినాష్‌రెడ్డి మాట్లాడారు. జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. 2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లలో నాలుగుసార్లు సీబీఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాళెంను 6 టీఎంసీలతో నాలుగుసార్లు నింపడం జరిగింది. అందువల్లే రైతులకు ఏ ఇబ్బంది లేకుండా సాగునీరు అందింది. 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో పులివెందులకు వచ్చారు. ఆయన వెళ్లాక వర్షమే లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ16 నెలల కాలంలో ఎక్కడా ఇబ్బంది పడకుండా లింగాల బ్రాంచ్ కెనాల్ కింద చెరువులు కావొచ్చు, పీబీసీ కింద చెరువులు కావొచ్చు, జీకేఎల్ఐ కింద చెరువులకు కావొచ్చు సవృద్ధిగా అరటి, చీని రైతులకు నీళ్లు అందించామంటే దానికి కారణం జగనన్న ముందుచూపుతో సీబీఆర్ లో 10 టీఎంసీలు పెట్టడం. పైడిపాళెంలో 6 టీఎంసీలు పెట్టడం వల్లనే సాధ్యమైంది.
2014 నుంచి 2019 వరకు మన జిల్లా రైతాంగానికి రూ.750 కోట్లు పంటల బీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రూ.1,100 కోట్లు అందింది. అదేవిధంగా ఇ¯Œపుట్ సబ్సిడీ 2014 నుంచి 2019 వరకు బాబు హయాంలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే అందింది. జగనన్న హయాంలో సుమారు రూ.278 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమైంది. 2023 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల∙ఏదైతే నష్టపోయామో దానికి సంబంధించి పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమవుతుంది. ఒకవైపు మొగమేరు చూస్తే గతంలో ఎలా ఉండేది?, ఇప్పుడెలా ఉందో చూడండి. రైతులకు ప్రయోజనకరంగా కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యామ్‌లు నిర్మించడం జరిగింది. మరోవైపు గాలేరు నగరి హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే కాలేటివాగు డ్యామ్‌ను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజీ డ్యామ్‌గా మార్చడం జరిగింది. తప్పకుండా సంవత్సరం రోజుల్లో పంప్ హౌస్‌ను కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన 6 మండలాల్లా సస్యశ్యామలం చేస్తాం.
ఇంత పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మన తప్పులను చూపలేక, చేసేదేమీలేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపుగా మన మీదకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూటమిగా వస్తున్నారు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారాలు చేస్తున్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చెబుతున్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే అది నిజమవుతుందనేది చంద్రబాబు, ఎల్లో మీడియా సిద్ధాంతం. వాళ్ల ట్రాప్‌లో ఎవరూ పడొద్దు. ప్యాకేజీ స్టార్ కావొచ్చు, బీజేపీ కావొచ్చు, పరోక్షంగా కాంగ్రెస్ కావొచ్చు.. మీరు ఎన్ని తప్పుడు హామీలిచ్చినా జగన్మోహన్రెడ్డిని టచ్ చేయలేరు. చంద్రబాబు అండ్ కోకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ జగన్‌కు అండగా రాష్ట్రంలో లక్షలమంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులున్నారు. ఆయనకు అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటున్నారు. కాబట్టి ఎంతమంది కలిసొచ్చినా సరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరు. 2019 లో ఎలా ఆశీర్వదించారో ఈసారి ఎన్నికల్లో మీ ఆదరణ, ఆశీస్సులు సంపూర్ణంగా జగనన్నపై ఉండాలి.