‘ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో.. సంక్షేమ పథకాలు చెప్పారో.. అవన్నీ అమలు చేసి చూపించారు జగనన్న. గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా మాట మీద నిలబడ్డారు’ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో అవినాష్‌రెడ్డి మాట్లాడారు. జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. […]
ఉక్కు పరిశ్రమ పనులు మొదలు అయ్యాయని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ జిందాల్ స్టిల్స్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఉక్కు పరిశ్రమ పనులు సాగుతున్నాయని తెలిపారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని తద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించామని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఆయన చేస్తున్న ప్రచారంలో ప్రజలంతా నీరాజనం పడుతున్నారని, కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు […]
వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన కుమార్తె అల్లిన కట్టు కథలకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. మీడియా సమావేశంలో వాస్తవాలను బయటపెట్టారు. వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సీబీఐ అతన్ని అరెస్ట్ చేయలేదు. పైగాS ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం […]
‘నరేంద్రమోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి’, ‘బెయిల్ కోసం అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీ వద్దకు కుటుంబసభ్యులను పంపి కాళ్లబేరానికి దిగిన చరిత్ర జగన్‌ది. దాని ఫలితమే అవినీతి కేసుల్లో అతనిపై విచారణ కూడా జరగలేదు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయలేని పరిస్థితిలో సీబీఐ ఉందంటే పైవాడి ఆశీస్సులు లేకుండా సాధ్యమా..’ తాజా […]