దేశంలో ఈ నినాదం దశాబ్దాల కాలంగా కేవలం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల మాటలకు, మీడియా బూటకపు రాతలకు మాత్రమే పరిమితం అయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటినుండి పిల్లలు చదువులు పట్ల వారి భవిష్యత్తు పట్ల చేతల్లో చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వాలను నేతలను మనం ఎప్పుడైనా చూసామా? బహుశా పిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా! వారిపై మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనేది ఆయా ప్రభుత్వాలు, నేతలు, రాజకీయ పార్టీలు ఉద్దేశం కాబోలు.
కానీ, ఒక దార్శనికుడు అధికారంలోనికి వచ్చాక పిల్లల భవిష్యత్తుకు పాటుపడుతున్నాడు. నాడు నేడు ద్వారా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. విద్యారంగంపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 73 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాడు. నేటి పోటీ ప్రపంచంలో పేదరికం రూపుమాపే ఏకైక ఆయుధం చదువు ఒక్కటే అని బలంగా నమ్మి అడుగులు ముందుకేసిన ఏకైక నాయకుడు వైయస్ జగన్.
భవిష్యత్ తరాలకు బాటలు వేస్తూ రేపటి తరాల తలరాతలు మార్చే గొప్ప అడుగులకు నాంది పలుకుతున్న ఇటువంటి అరుదైన పాలన కలకాలం కొనసాగాలని కోరుకోవడంలో తప్పు ఏమైనా ఉందా? భావితరాలకు బాసటగా నిలుస్తూ సాగుతున్న ఒక దార్శనికుడి వెంట నడవడానికి “మేమంతా సిద్ధమని” చెప్పడంలో పొరపాటు ఏమైనా ఉందా? కచ్చితంగా లేనేలేదు. భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రభుత్వాలు ఎంత కాలం ఉంటే అంత గొప్పగా జీవన ప్రమాణాలు మారుతాయి. తరాల అంతరాలు మారి అభ్యుదయంలోకి అడుగులు పడతాయి. నేటి బాలలే రేపటి పౌరులు… భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే యోధులు…