వైయస్ జగన్ ప్రభుత్వంలో నా సొంత ఇంటి కల నెరవేరింది అని తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్న పాపానికి ఐటీడీపీ అరాచకాలకు బలైపోయిన సామాన్య గృహిణి గీతాంజలి. కేవలం ఆమెకి జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందని చెప్పటమే ఆమె పాలిట శాపంగా మారింది. తాను పొందిన మేలును పది మందితో పంచుకోవటమే ఆమె చేసిన నేరమైపోయింది. అయితే ప్రభుత్వం చేసిన మంచిని చెప్పడం ఓర్చుకోలేని టిడిపి అనుకూల మీడియా, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగం అయిన ఐటీడీపీ మాటల్లో చెప్పలేని బూతులతో దుర్భాషలాడుతూ ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దుష్ప్రచారాలు చేశాయి. దీనితో మనస్థాపం చెందిన గీతాంజలి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణం ఒక్క తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసింది.
అయితే కష్టం విలువ తెలిసిన వాడే కన్నీరు తుడుస్తాడు బాధ్యతల భారం ఎరిగిన వాడే బరువును మోస్తాడు అన్నమాటని అక్షరసత్యం చేస్తూ తల్లిని కోల్పోయిన గీతాంజలి ఇద్దరు ఆడ బిడ్డలకు అండగా మేమున్నామంటూ వైయస్ జగన్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారులకు చేదోడువాదోడుగా మేము నిలుస్తామని అండగా నిలబడింది. భార్యను కోల్పోయి కృంగిపోయిన ఆమె భర్తకు, తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడబిడ్డలకు ఏ నోటు లేకుండా చూసుకుంటామని సీఎం జగన్ ప్రభుత్వం మాటే ఇచ్చింది. నేడు ఇచ్చిన మాటని నిజం చేస్తూ గీతాంజలి ఇద్దరూ ఆడబిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది వైయస్ జగన్ ప్రభుత్వం. ఆ ఫిక్స్ డిపాజిట్లకి సంబంధించిన చెక్కులను ఈరోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా గీతాంజలి కుటుంబ సభ్యులకు ఆమె భర్తకు అందజేసింది. కులమతాలకు అతీతంగా, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎవరికి కష్టం వచ్చినా కంటి రెప్పలా కాపాడుకుంటుందని మరొకసారి రుజువు చేసింది.