వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు నేటి వరకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన అంశం విద్య.. బహుశా విద్యపై సీఎం జగన్ పెట్టినంత శ్రద్ద కానీ ఖర్చుగాని గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు పెట్టలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చదువొక్కటే దేశంలో పేదరికాన్ని రూపుమాపుతుంది అని బలంగా నమ్మిన జగన్ నాడు నేడు ద్వారా. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు
జగన్ తన పాలనలో విద్యా రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చారు. ధనికులకు అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమైన కార్పొరేట్ విద్యను నిలువ నీడలేని నిరుపేద బతుకులకు అందించాడు. పెద్దోళ్ళు మాత్రమే చదవగలిగే విద్యను పేదోళ్ల పిల్లల చెంతకు చేర్చాడు. సామాన్యుడు సైతం అసామాన్య చదువులు చదవాలి, ఉన్నత స్థితికి చేరాలి అనే సంకల్పంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు అడుగులు ముందుకు వేశాడు. విద్య ఒక్కటే ఈ దేశంలో పేదరికాన్ని, అంటరానితనాన్ని, అణగారినితనాన్ని రూపుమాపుతుంది అని నమ్మి నడిచి ఆచరించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్.
కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో CBSE సిలబస్ ప్రవేశపెట్టాడు. టోఫెల్ శిక్షణ ను సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు తెచ్చిన గొప్ప పాలకుడు సీఎం జగన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్ధులు, ఉపాధ్యాయులకు రూ.1306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్ల పంపిణీ చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానికి చెందుతుంది. ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్
(IFP) ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు చేసిన ఘనత కూడా వైయస్ జగన్ ప్రభుత్వానికే చెందుతుంది. 3వ తరగతి నుండే సబ్జక్ట్ టీచర్ విధానం తీసుకువచ్చాడు. వందేళ్ళ భారతదేశ రాజకీయ చరిత్రలో విద్య మీద ఇంత గొప్పగా అడుగులు వేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.