“జగన్ ఒక్క ఉద్యోగమన్నా ఇచ్చాడా” అని లోకేష్ చేసిన ప్రసంగానికి టీడీపీ జనమంతా హాహాకారాలు వ్యక్తం చేస్తూ… రంకెలు వేస్తున్నారు కానీ, అసలు సత్యదూరంగా ఉన్న లోకేష్ మాటలని పరిశీలించి, నిజానిజాలు నిగ్గుదేలిస్తే.. “ఇటువంటి మనిషా మన చినబాబు” అని ఆ జనమే అనుకునేంత రీతిలో ఇటువైపు జగన్ చేసిన పనులు కనపడుతున్నాయి.
అసలు లోకేష్ లేవదీసిన ఉద్యోగాలు అనే అంశాన్ని, ఎవరి పాలనలో ఎన్ని అని తరచి చూస్తే తెలుగు తమ్ముళ్ళు విస్తుపోయే నిజాలు బయటపడతాయి. 2014 నుంచి ఐదేళ్లలో బాబు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34 వేలు ( 34,108 ) మాత్రమే.
కానీ జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు- 2.21 లక్షలు (2,21,003 ). ఇవేమీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కాదు గత అయిదేళ్ళళో ఆంధ్ర నుంచి నమోదయిన పీ.యఫ్ ఖాతాలు చూస్తేనే తెలుస్తుంది. ఇంక కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య -43,923 కాగా, ఔట్ సోర్సింగ్.. ఇతర ఉద్యోగుల సంఖ్య- 3,73,161 గా నమోదయింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య-6. 38 లక్షలు ( 6,38,087 ).
విలేజ్ క్లినికులు, ఫామిలీ డాక్టర్లు, ఆశా వర్కర్లు ఇలా ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఏకంగా 53,446 పోస్టులను భర్తీ చేసింది జగన్ ప్రభుత్వం. ఇవేమి తెలియని చినబాబు, ఎవరో రాసిచ్చిన స్పీచులను ఊరికే ఊకదంపుడుగా ఉపన్యాసాలిస్తే పోయేది టీడీపీ పరువే అన్న సంగతి పాపం టీడీపీ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో??