ఎట్టకేలకు ఉద్దానం ప్రాంత ప్రజలకి మోక్షం కలిగింది. 7మండలాల్లో లక్షలాది కుటుంబాలలో కనీసం ఇంటికొక కిడ్నీ బాదితులతో నిండిపోయిన ఆ ప్రాంత భాదలకి చరమగీతం పాడే రోజు జగన్ గారి పాలనలో రానే వచ్చింది. గత 40 ఏళ్ళుగా ఉద్దాన ప్రాంత వాసులు ఎదుర్కొoటున్న కిడ్నీ సమస్యలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి కానీ వ్యాధి కనుక్కొలేక పోయారు. ఏ కల్మషం లేకుండా అద్దమోలే మెరిసే ఉద్దానమ్మమో ఏం అందమమ్మో అని పాడుకునే ఆ ప్రాంత వాసులని ఏదో ఒక మహమ్మారి పట్టిపీడిస్తుందని 2000-2003 మద్య మొదట గుర్తించబడింది. వైయసార్ గారు సీఎం అయ్యాక ఉద్దానం ప్రాంతంలో మొట్టమొదట కేజిహెచ్ వైద్య బృందం, జిల్లా వైద్య బృందం కలిసి 2004లో అద్యయనం చేశాయి, నీరు రక్త నమూనాలు లాబ్ కి పంపడం, ఆహార అలవాట్లపై ప్రాధమిక అద్యాయనం జరిగింది.
2007లో అమెరికా లోని శాంఫ్రాన్సిస్కొ కిడ్ని వ్యాదులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది అక్కడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తరుపున కేజిహెచ్ లో అప్పటి నెఫ్రాలజీ విభాగం అధిపతిగా ఉన్న డాక్టర్ రవిరాజుని పంపించారు, ఆయన ఈ ఉద్దానం కిడ్ని వ్యాదుల తీవ్రతను మొదటి సారి అంతర్జాతీయ వేదిక మీదకి తెచ్చి ప్రపంచ దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఈయన అంతకు ముందే 15-12-2006న ప్రభుత్వ సూచనల మేరకు కమిటీలో వైద్య శిబిరాలు నిర్వహించారు 20 గ్రామాలకు చెందిన 63,000 మందికి ఈ అంశంపై అవగాహన కల్పించారు.
2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు ఏపీ అకాడమి ఆఫ్ సైన్స్ సిసియంబి నెష్నల్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి న్యూడిల్లి, నిమ్స్ హైద్రాబాద్, ఉమ్మడిగా అద్యయనం చేసి కిడ్నీ వ్యాదులకు గల కారణాలు నిర్ధారణ కాలేదని తేల్చారు. 2008లోనే అమెరికాలోని హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ, విశాఖ కేజిహెచ్ వైద్య నిపుణుల బృందం ఉద్దానం కిడ్ని వ్యాధులపై అద్యాయనం చేపట్టాయి, ముంబైలోని కేంద్ర పరిశోధనాశాలకు రక్తం, మట్టి నమూనాలు పంపారు కాని కారణం మాత్రం గుర్తించలేదు. ఆ ప్రాంత ఆహార అలవాట్లపై మరింత అద్యయనం చేయాలని వారు నివేదిక ఇచ్చారు – ఇలా తదుపరిగా ముందుకు వెళ్ళే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో చనిపోయారు. తర్వాతి ప్రభుత్వాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు.
అక్కడ కనీసం సరైన వైద్య సదుపాయాలు లేవు అని గుర్తించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గరు 2008 అక్టోబర్ లో రాజీవ్ గాంధి ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఉద్దానం భాదితులు అక్కడే వైద్యం చేయించుకుంటు వస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కిడ్నీ భాదితులకి డయాలసిస్ చేయించేవారు. తర్వాత 2011లో యుపి జన్రల్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సంస్థ వ్యాది తీవ్రత ఉన్న 15 గ్రామాలలో స్వచందంగా ఓ ప్రత్యేక సర్వే జరిపి భాదితులకి వైద్య సౌకర్యం అందటంలేదని తేల్చింది.
హార్వార్డ్ వైద్య విద్యా సంస్థ తమ పరిశోధనపై 2012లో నివేదిక ఇచ్చింది కాని వ్యాధి కారణాలు మాత్రం వెల్లడించలేకపోయింది. పర్యావరణంతో పాటు త్రాగునీరు ఈ సమస్యకు కారణం అనే అనుమానం వ్యక్తం చేసింది. మరింత పరిశోధన చేయాలని తెల్చి చెప్పింది. 2013లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అద్యాయనం చేశాయి, ఉద్దానం ప్రాంతంలో 28 శాతం ప్రజలు కిడ్నీ వ్యాధులతో భాదలు పడుతున్నారని, వాళ్ళకి సరైన వైద్యం అందించాలి ఆర్ధికంగా ఆదుకోవాలని చెప్పింది. చైనాలోని హాంకాంగ్‌లో 2013లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ నెఫ్రాలజీలో ఈ పరిస్థితిని చర్చించి “ఉద్దానం నెఫ్రోపతి” అని పేరు పెట్టారు.
2013 చివరిలో నేషనల్ జియాగ్రఫికల్ రీసర్చ్ ఇన్స్టిట్యుట్ హైద్రాబాద్, సైన్స్ అండ్ టెక్నాలజి డిల్లీ సంస్థ కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులతో అద్యయనం చేశారు. 2014లో నిమ్స్ , సి.సి.యం.బి, ఏ.యు, హైడ్త్రలాజికల్ ఆఫ్ ఇండియా , రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖా ఆద్వర్యంలో అద్యయనం జరిగినా ఏది తేల్చలేక పోయారు. 2015లో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వైద్య బృందం అద్యయనం చేసింది కానీ వాళ్ళ నుండీ కూడా కొత్త విషయాలు ఏమీ వెల్లడి కాలేదు “ఎండిన ఉప్పు చేపలు తినటం, ఇతర ఆహార అలవాట్లు, త్రాగునీటిపై” మరింత అద్యయనం చేయాలని ఆ బృంధం వెల్లడించింది.
స్టొన్ బ్రూక్ యునివర్సిటి బృందం చేసిన అద్యయనంలో మరిన్ని అనుమానాలు ఏర్పడ్డాయి, ఉద్దానం ప్రాంతంలో పండే మునగకాయ తినటం వలన వాటిలో ఉండే పొటాషియం కిడ్ని వ్యాదులు రావటానికి అవాశం ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తపరిచింది, ఇంకా ఆ ప్రాంతంలో జీడి మామిడి, కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండటం వలన ఆ తోటకు వాడే ఎండొ సల్ఫన్ తదితర పురుగు మందు వినియోగం ఎక్కువ అవ్వటం వలన కిడ్నీ వ్యాదులు రావడానికి కారణం అవ్వచ్చని అభిప్రాయాలు వచ్చాయి. చివరికి అనేక అద్యయనాలను క్రోడీకరించి ఉద్దానం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో కొన్ని ప్రమాదకర లోహాలు కారణంగానే ఆ నీటిని తాగే అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
ఇంత తీవ్రమైన సమస్య ఉన్న ప్రాంతమైనా, 2014లో ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ గారు నాడే సమస్యపై గళమెత్తారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు కి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ జగన్ గారికి మద్దతు లభించకూడదనే రాజకీయ ఎత్తుగడతో చంద్రబాబు ప్రభుత్వానికి నెప్పి తగలకుండా రెండు మూడు సార్లు సమస్యను అడ్రెస్ చేసినా అదంతా ఉద్దానం ప్రాంతం విషయంలో చంద్రబాబు పరిపాలనా లోపాలని కప్పి పుచ్చేందుకే అని ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు. ఫలితంగానే జనసేనకు ఉద్దాన ప్రాంతంగా చెప్పబడుతున్న 7 మండలాల్లో 2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు. జగన్ గారు మాత్రం తమకి అధికారం ఇస్తే సమస్యను పరిష్కరిస్తాం అని ప్రజలకి హామీ ఇచ్చారు. జగన్ గారి చిత్తశుద్దిని ప్రజలు సైతం నమ్మి అధికారం కట్టబెట్టారు.
ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే జగన్ గారు 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడునెలలకే రూ.700 కోట్లతో పలాస, ఇచ్ఛాపురం రెండు మున్సిపాలిటీలతో పాటు ఆ ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే ఉద్దానం రక్షిత మంచినీటి పథకానికి 2019 సెప్టెంబరు 6న ప్రభుత్వం మంజూరు చేసింది. హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల వంశధార జలాలు అందుబాటులో ఉంటాయని , అందులో 1.12 టీఎంసీల నీటిని ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 ఆరంభంలోనే పనులను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పనులు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కిడ్నీ వ్యాధుల నియంత్రణ కోసం రీసెర్చ్ సెంటర్‌తో పాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా నిర్మించారు.
40 ఏళ్లుగా కిడ్నీ మహమ్మారి కారణంగా వేలాది మంది ఉద్దానవాసులు ప్రాణాలు కోల్పోయారు, తమ ప్రాణాలను కాపాడే దేవుడు ఎప్పటికైనా రాకపోడా అనే ఆశతో ఇన్నాళ్లూ బతికిన ఉద్దానం ప్రజల ఆశలు నెరవేరుతూ ఎట్టకేలకు సీఎం జగన్ గారి చొరవతో మోక్షం కలిగిందనే చెప్పాలి. పాలకుల్లో చిత్తశుద్ది ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కారం చూపవచ్చని సీఎం జగన్ తన పాలనలో నిరూపించారు. తన గురించి ప్రజలందరు అనుకునే విధంగానే చెప్పాడంటే చెస్తాడంతే అనే మాటని సీఎం జగన్ గారు మరోసారి తన పరిపాలనతో నిరూపించుకున్నారు. ఉద్దానం ప్రాంతంలో లక్షలాది మంది ప్రజల సమస్యను తీర్చిన నాయకుడిగా చరిత్రలో జగన్ గారు నిలిచిపోతారు.