ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తర్వాత బద్వేలు నియోజకవర్గాన్ని సీఎం జగన్ ఎంతో అభివృద్ధి చేశారు. గత అయిదేళ్లలో బద్వేలు నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేసి దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా దాదాపు 1422 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయగా మరి కొన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బద్వేలును పారిశ్రామిక కేంద్రంగా చేయడమే కాకుండా సీఎం జగన్ చేసిన అభివృద్ధి పనులను ఓసారి పరిశీలిస్తే ఆశ్చర్యపోయే అభివృద్ధి గురించి తెలుస్తుంది. వాటిని ఓసారి పరిశీలిస్తే..
గోపవరం మండలంలో 100 ఎకరాలలో రూ.1500 కోట్ల పెట్టుబడితో సెంచరీ ప్లైవుడ్ కంపెనీ స్థాపన తద్వారా 2500 మందికి ప్రత్యక్ష ఉపాధి. మరో 450 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు.
రూ.30 కోట్లతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఆలయాల పునర్నిర్మాణం, నూతన దేవాలయాల నిర్మాణం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలోని 1000 దేవాలయాలకు ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల వంతున నిధులు కేటాయింపు
ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అందే విధంగా రూ. 47 కోట్లతో ఏడు మండలాల్లో నాడు – నేడు కార్యక్రమం ద్వారా స్కూల్ బిల్డింగ్స్ ఆధునీకరణ, నూతన తరగతి గదుల నిర్మాణం
అందరికీ ఆరోగ్యం అందాలనే ఏకైక సంకల్పంతో రూ. 20 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణతో పాటు బద్వేలులో, పోరుమామిళ్ళలో 50 పడకల ఆసుపత్రులు, 3 అర్బన్ హెల్త్ సెంటర్లు, బద్వేలులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ రూ.100 కోట్లతో బద్వేల్ నియోజకవర్గంలో నిర్మితమైన 73 సచివాలయాలు, 73 రైతు భరోసా కేంద్రాలు, 61 విలేజ్ హెల్త్ క్లినిక్స్, లైబ్రరీలు, పాలకేంద్రాలు
రూ. 8 కోట్ల నిధులతో బద్వేలు, పోరుమామిళ్ళలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న వ్యవసాయ మార్కెట్ కమిటీకి గోడౌన్స్
35 చెరువులకు నీరు నింపే విధంగా రూ. 90 కోట్ల వ్యయంతో లోయర్ సగిలేరు ప్రాజక్టు కాలువలను 200 క్యూసెక్కుల కెపాసిటీ నుండి 500 క్యూసెక్కులకు పెంపు.
ఏడు గ్రామాలకు త్రాగునీరు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రూ. 32 కోట్లతో కాశినాయన మండలంలో శరవేగంగా నిర్మితమవుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.
రూ.16 కోట్లతో కలసపాడు మండలంలో తడుకు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు
రూ. 48 కోట్లతో తెలుగు గంగ ప్రాజెక్ట్ లీకేజ్ అరికట్టడం కోసం డయాఫ్రం వాల్ నిర్మాణం. రూ. 37 కోట్లతో కొనసాగుతున్న కుడి, ఎడమ కాలువలకు మరమ్మత్తులు, నూతన కాలువల నిర్మాణ పనులు
నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం రూ.18 కోట్లతో 33/11 KVA 6 సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి. త్వరలో మరో 4 నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు
రూ. 196 కోట్లతో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న గ్రామీణ రహదారులు, అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు
బద్వేలు ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు వివిధ పంచాయితీల్లో 100 తాగునీటి వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు. రూ. 80 కోట్లతో బ్రహ్మంసాగర్ నుండి నూతన నీటి పైప్ లైన్ల నిర్మాణం (టెండర్ దశలో ఉన్నది)
రూ. 30 కోట్లతో బద్వేల్ రెవెన్యూ డివిజన్, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నిర్మాణం.
రూ. 165 కోట్లతో బద్వేలు పట్టణంలో 5వేల గృహాల నిర్మాణం, బద్వేలు నియోజకవర్గంలో 5 వేల గృహాల నిర్మాణం. మొత్తం 10 వేల గృహాల నిర్మాణం.
ప్రస్తుతం బద్వేలులో 130 కోట్లతో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు జరుగుతున్నాయి..
ఈ అభివృద్ధి మొత్తం కేవలం జగనన్న ఐదేళ్ల పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగిన అభివృద్ధి. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలన్నా, మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలన్నా తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ ని గెలిపించుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.