కుటుంబాలను చీల్చే రాజకీయ కుట్రల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న మాటలు అక్షరాలా మరోసారి నిజమయ్యాయి. తన కుమారుడి వివాహానికి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు తాడేపల్లికి వెళ్లిన షర్మిలను కలిసేందుకు సీఎం జగన్ విముఖత చూపించారని ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ మొదటి పేజీ ప్రధాన వార్తగా వేయడం చూసి ప్రజలంతా అవాక్కవుతున్నారు.
కాకినాడ సభలో కుటుంబాలను చీల్చే రాజకీయ కుట్రల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారని, పొత్తులతో మోసపూరితం గా మీ ముందుకు వస్తారని సీఎం జగన్ వెల్లడించిన విషయం తెలిసిందే. తమ కుటుంబాన్ని వారి రాజకీయ ప్రయోజనాల కోసం చీల్చే కుట్రలు చేస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కానీ జగన్ అన్నట్లుగానే షర్మిలకు జగన్ కు మధ్య ఇదీ జరిగందంటూ ఆంధ్రజ్యోతి అచ్చేయడం చూసి ఇవేం జర్నలిజం విలువలంటూ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విషయం వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయాన్ని మక్కికి మక్కీ రాయాలంటే అక్కడ సీక్రెట్ గా స్పై కెమెరాల్లో రికార్డ్ చేస్తే కానీ సాధ్యం కాదు. కానీ రాధా కృష్ణ మాత్రం ఈ విషయాలను తానే పక్కనుండి చూసినట్లుగా జగన్ రాయలసీమ యాసలో ఇలాగే మాట్లాడాడంటూ దిగజారిపోయి రాయడం చూసి ముక్కున వేలేసుకోవడం ప్రజల వంతయింది. ప్రస్తుతానికి ఏపీలో టీడీపీకి గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. మొదటినుండి జర్నలిజం విలువలను తాకట్టు పెట్టి చంద్రబాబు భజన చేస్తూ టీడీపీని నిలబెట్టే బాధ్యత తీసుకున్న ఎల్లో మీడియా ఆఖరికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ యాసతో సహా అచ్చేసి తనకు చంద్రబాబు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తుంది కానీ తన రాతలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మాత్రం మర్చిపోయింది. ఇదే పంథాను కొనసాగిస్తూ కుటుంబాలను చీల్చే కథనాలను ప్రచురిస్తే టీడీపీతో పాటు ఎల్లో మీడియాను కూడా ప్రజలు పాతాళానికి తొక్కేయడం ఖాయం. ఈ విషయాన్ని రాధాకృష్ణ గుర్తుంచుకుంటే మంచిది.