రోజుకు మూడు చొప్పున బహిరంగ సభలు నిర్వహిస్తూ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చాటి చెప్పిన జగన్, బహిరంగ సభల్లో తనకు ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా ఫైర్ స్టేషన్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే..
ఏలూరు సిద్ధమా?.. ఎండాకాలం, ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. ఆత్మీయతలను పంచిపెడుతున్నారు. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు నా ప్రతి అక్కకూ,చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.
మరో రెండు వారాల్లో జరగబోతోంది కురుక్షేత్ర సంగ్రామం. ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న యుద్ధం కాదిది. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని సవినయంగా మీ అందరితో కోరుతున్నాను.
ఈ ఎన్నికల్లో మీ జగన్ కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరో రెండు అడుగులు ముందుకు, ఇంటింటా అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇదే బాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో తాను నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండచిలువ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతున్నాను.
ఈరోజు మీ జగన్.. పేదలు.. పేదలు అని మాట్లాడుతుంటే పెత్తందారీ చంద్రబాబుకు, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ5కి, దత్తపుత్రడికి, వదినమ్మకు.. వీళ్లందరికీ చాలా బాధగా ఉంది. విపరీతంగా కోపం వస్తోంది. జగన్ ఎప్పుడూ పేదలు పేదలు అంటున్నాడని వీళ్లంతా తట్టుకోలేకపోతున్నారు. అందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈరోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు జరుగుతున్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు, జరుగుతున్న సంఘర్షణ ఒక క్లాస్ వార్. పేదలు ఒకవైపు ఉన్నారు. పెత్తందార్లు మరోవైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతోంది.
ఈ యుద్ధంలో మన వైయస్సార్ సీపీ, మీ బిడ్డ జగన్ పేదల పక్షం అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని చెబుతున్నాడు. నేనుపేదలు.. పేదలు అని ఎందుకు ఇంతగా అంటున్నానో, ఎందుకు వారి కోసం తపిస్తున్నానో వివరంగా కూడా చెబుతాను. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా 1.44 కోట్లు. అంటే మన జనాభాలో 90 శాతం దాదాపుగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలే. మరి నేను అడుగుతున్నాను. వీరందరూ పేదలు కాదా? అని అడుగుతున్నాను. వీరందరికీ పథకాలు అందాలా లేదా?
ఇవాళ వార్షికాదాయం రూ.5 లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈరోజు ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్లు దాదాపుగా మన జనాభాలో 95 శాతం మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. మరి నేను అడుగుతున్నాను. వీళ్లంతా కూడా పేదల జాబితాలోకి రారా అని అడుగుతున్నాను. మరి వీరందరికీ పథకాలు అందాలా? లేదా? రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు.. ఇంజనీరింగ్, డిగ్రీ, మెడిసిన్ చదువులు చదువుతున్న పిల్లలు ఈరోజు ఈ రాష్ట్రంలో 93 శాతం మందికి ఈరోజు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వాళ్లందరికీ కూడా అందుతోంది.
నేను అడుగుతున్నా ఏకంగా 93 శాతం మంది పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన అందుతుంటే మరి వీళ్లందరూ పేదలు కాదా? మరి వీరందరికీ పథకాలు అందాలా? లేదా? రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలు కోటీ 5 లక్షల మంది ఈరోజు పొదుపు సంఘాల్లో ఉన్నారు. మరి వీరంతా పేదలు కాదా? మరి వీరందరికీ పథకాలు అందాలా? లేదా? ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న నా అవ్వాతాతలు, నా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి అక్కలు, ఏకంగా 66 లక్షల మంది ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరితోపాటు రైతు భరోసా అండతో నిలబడిన నా అన్నలు మరో 55 లక్షల మంది నా రైతన్నలు ఉన్నారు. వీరు కాక మరో 60 లక్షల మంది అమ్మ ఒడి తీసుకుంటున్నారు. విద్యాదీవెన తీసుకుంటున్నారు. వసతి దీవెన తీసుకుంటున్నారు. వీరందరూ నా చెల్లెమ్మలు. ఆ తల్లులందరూ తీసుకుంటున్నారు.
సున్నా వడ్డీ కింద, వైయస్సార్ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కింద అందుకుంటున్న వారు మరో కోటి మందికిపైగా ఉన్నారు. 31 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల పట్టాలిచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. అందులో 22 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి. వీరందరూ పేదలు కాదా? అని అడుగుతున్నాను మీ అందరి సమక్షంలో. మరి వీరందరికీ పథకాలు అందాలా? లేదా?
మరి నేను ఈ చంద్రబాబును అడుగుతున్నాను. ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్ ఇంత మందికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 90 శాతం మంది పేదలకు ఈరోజు మంచి జరిగిస్తుండడం అనేది చేయాలా? వద్దా? ఈ మాట అడుగుతూ మరి వీరందరికీ కూడా ఎవరు మేలు చేశాడు? ఎవరు నిజమైన నాయకుడు? ఎవరు లీడర్ అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతున్నాను.
చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా, గత చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని ఒక్కసారి చూస్తే.. పిల్లల చదువుల కోసం ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్ట మొదటి సారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా, దేశంలో ఎక్కడా చూడనట్టుగా ఈ 59 నెలల పాలనలోనే పిల్లలను బడులకు పంపిస్తూ, తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదా? బడుల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడుల్లో ఇవాళ ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాం. పిల్లలకు గోరుముద్ద, విద్యాకాను, 3వ తరగతి నుంచే గవర్నమెంట్ బడుల్లో ఈరోజు టోఫెల్ కు శిక్షణ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్. మొట్ట మొదటి సారిగా పెద్దల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ మన పేద పిల్లలకు అందుబాటులో తెచ్చాం. మొట్ట మొదటి సారిగా 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలు, డిజిటల్ బోధన, మొట్ట మొదటి సారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చే సరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి.
మొట్ట మొదటిసారిగా ఇంగ్లీషు మీడియంతో పాటు సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం సాగుతోంది. మొట్ట మొదటిసారిగా పెద్ద చదువుల కోసం ఏ తల్లీతండ్రీ ఇబ్బంది పడకూడదని, ఆ పిల్లలు గొప్పగా చదవాలి, ఎదగాలి అని ఆ పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకే ఇస్తున్నాము. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కింద. డిగ్రీ చదువుతున్న పిల్లలకు సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేయడం కూడా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడుతున్నాను.
ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని మార్పులు. మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతున్న మార్పులు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం మీ బిడ్డ ఏరకంగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ నా అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాడు. ఓ అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ ఈ పథకాలన్నీ కూడా చూడలేదు. ఈ రోజు రాష్ట్రంలో ఈ 59 నెలల కాలంలో నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని, నా అక్కచెల్లెమ్మల సాధికారత కోసం ఈరోజు ఓ అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈసీబీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేశాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. అక్కచెల్లెమ్మలకు రక్షణ కల్పిస్తూ.. ఈరోజు ఏ అక్కచెల్లెమ్మ కూడా ఎక్కడికి వెళ్లినా కూడా వారి ఫోన్లోనే దిశ యాప్. వాళ్ల గ్రామంలోనే వాళ్ల కోసమే ఒక మహిళా పోలీస్.
మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం నా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పై ఇచ్చే పదవులు కానీ, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో గానీ ఏకంగా చట్టం చేసి నా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, అది జరిగింది ఎప్పుడైనా ఉంది అంటే అది ఈ 59 నెలల కాలంలోనే, మీ బిడ్డ హయాంలోనే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నాను.
మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు స్వయం ఉపాధికి మీ జగనన్న తోడుగా ఉంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు, చిన్నచిన్నగాగా గ్రామాల్లో బతుకుతున్న వారు.. వీళ్లందరినీ కూడా చేయి పట్టుకుని నడిపిస్తూ, గతంలో ఎప్పుడూ జరగని విధంగా, వాళ్లందరికీ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ రైతన్నలకు ఓ రైతు భరోసా, అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆటోలు, ట్యాక్సీల డ్రైవర్లకు, సొంతంగా నడుపుకొంటున్న వారికి వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఈరోజు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఓ తోడు, ఓ చేదోడు, ఓ లా నేస్తం, మొట్ట మొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడూ జరగనంతగా ప్రోత్సాహం, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగినది ఎప్పుడు అంటే ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు చూశారు అంటే, ఎప్పుడు జరిగాయి అంటే ఈ 59 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
ఆలోచన చేయమని కోరుతున్నాను. సంస్కరణలు తీసుకొచ్చాం. పథకాలు తీసుకొచ్చాం. ప్రతి పేదవాడి బతుకునూ మార్చాలని అడుగులు పడుతున్నాయి. మొట్ట మొదటిసారిగా గ్రామం బాగు కోసం, వార్డు బాగు కోసం, మొట్ట మొదటిసారిగా ఈరోజు గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చాయంటే ఈరోజు 600కు పైగా సేవలు గ్రామంలో అందిస్తున్నాయంటే 60-70 ఇళ్లకు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అంటే.. ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఇంటికే పెన్షన్ వస్తోందంటే, నేరుగా ఇంటికే పౌర సేవలు అందుతున్నాయంటే, నేరుగా ఈరోజు ఇంటికే పథకాలు అందుతున్నాయంటే గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు గ్రామ, వార్డు స్థాయిలోనే విలేజ్ క్లినిక్ లు కనిపిస్తున్నాయంటే, నాడునేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూల్లు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఆ హాస్పిటల్లు, ఆ స్కూల్లు, మన కళ్ల ఎదుటనే ఈరోజు ఇంగ్లీషు మీడియం బడులు కనపిస్తున్నాయి. ఈరోజు మన గ్రామంలోనే మహిళా పోలీస్ కనిపిస్తోందంటే, ఇంటింటికీ ఆరోగ్య సురక్ష వస్తోందంటే.. ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికీ కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడంటే, ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ వచ్చిందంటే, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయంటే ఇవన్నీ సంస్కరణలు జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కాదా?
రైతన్నల బాగు కోసం గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఇస్తున్నది ఎప్పుడు జరిగింది అంటే అది ఈ 59 నెలల పాలనలో కాదా? ఈరోజు ప్రతి గ్రామంలోనూ రైతన్నలకు చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకేలు, ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, సమయానికే, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు, పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ రైతన్నకు ఇవాళ జరుగుతోందంటే మీరే గమనించండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఈరోజు ధాన్యం కొనుగోలు జరుగుతోందంటే, ప్రతి రైతన్నకూ ఎమ్మెస్పీయే కాదు, ఎమ్మెస్పీకి మించి జీఎల్టీ పేరుతో రైతన్నలకు ఈరోజు అందుతోందంటే.. ఈరోజు ఆక్వా రైతులకు కూడా రూపాయిన్నరకే కరెంటు అందుతోందంటే.. ఆయిల్ పామ్ రైతన్నకు ఈరోజు మెరుగైన రేటు వచ్చి తోడుగా ఉన్నామంటే.. ఇవన్నీ కూడా జరిగింది ఈ 59 నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగింది మీ బిడ్డ పాలనలోనే కాదా? అని అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో. ఆలోచన చేయమని కోరుతున్నాను.
ఏరోజైనా మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా మీ చేతికే వస్తుందంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవాళ్లా? ఈరోజు ఈ 59 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతోంది. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. ఇవి జరిగింది ఎప్పుడు అంటే మీ బిడ్డ పాలనలోనే కాదా? అని ఈ సందర్భంగా అడుగుతున్నాను.
ఇచ్చే రూ.2.70 లక్షల కోట్ల డీబీటీలో ఏకంగా 75 శాతం పైచిలుకు నేను నా..నా..నా.. అని పిలుచుకునే నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు అందింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 2.31 లక్షల ఉద్యోగాలు.. రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే, ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో రూ.2.31 లక్షల ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల్లో 80 శాతం పైచిలుకు ఈరోజు నేను నా..నా..నా.. అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లే ఈరోజు కనిపిస్తున్నారంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా?
ఈరోజు మంత్రి పదవుల్లో ఏకంగా 68 శాతం నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఈ పేద వర్గాలే అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాష్ట్రంలో 5 డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 డిప్యూటీ సీఎంలు నేను నా..నా.. అని పిలుచుకునే ఈ పేద వర్గాల వారే ఉన్నారంటే ఇంతకన్నా సామాజిక న్యాయానికి నిదర్శనం అవసరమా? మొట్ట మొదటిసారిగా ఏకంగా చట్టంచేసి మరీ 50 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా ఈ వర్గాలకే వచ్చేట్టుగా చేసింది, జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే, ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
*దేశంలో ఎప్పుడూ జరగని విధంగా 50 శాతం సీట్లు…. *
వీటన్నింటికీ మించి దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు ఉంటే మొత్తంగా ఈ 200కు గానూ ఏకంగా 50 శాతం అంటే 100 స్థానాలు ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఈరోజు వైయస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్నారంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా? ఇంతకన్నా సామాజిక న్యాయం, ఇంత తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు ఇంత అండగా, తోడుగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను.
ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం ఈ 59 నెలల్లో మీ బిడ్డ ఏం చేశాడో మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేశాను. అదేవిధంగా ఇక్కడే నిల్చుని మీ అందరినీ ఒక్క మాట అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గురించి ఒక్కమాట అడుగుతున్నాను. చంద్రబాబు ఏమంటాడు? 14 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా, మూడు సార్లు నేను ముఖ్యమంత్రి అంటాడు. మీ అందరి సమక్షంలో నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? మరి ఇలాంటి వాడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏరోజూ పేదవాడి గురించి పట్టించుకున్న పుణ్యాన ఏరోజూ పోని ఈ వ్యక్తి ఈరోజు మోసం చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడుతున్నాడు. అబద్ధాలు చెబుతున్నాడు. మరి ఈ పెద్దమనిషి 2014లో ఎన్నికలప్పుడు ఏం చేశాడు, చెప్పిందేమిటి? చేసిందేమిటి అన్నది మీ అందరి సమక్షంలో అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి.
ఇది మీ అందరికీ గుర్తుందా? (పాంప్లెట్ చూపుతూ) 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు తాను స్వయంగా సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఈ ముగ్గురితో కలిసి ఫొటోలు దిగి, ఇదే కూటమి చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికీ పంపించాడు. అప్పట్లో ఆ ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లో అడ్వటైర్ మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తున్నాయా? ఆయన ముఖ్యమైన హామీలంటూ ఇవాళ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్నాడు. ఆరోజుల్లో ముఖ్యమైన హామీలన్నాడు. మరి ఆయన 2014లో ముఖ్యమైన హామీలంటూ ఆయన ఇచ్చిన పాంప్లెట్ లో ఇవన్నీ ఆయన చేశాడా? లేదా అన్నది మిమ్మల్నే అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.
రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల రుణాల మాఫీ జరిగిందా? ముఖ్యమైన హామీలు.. రెండోది చదువుతాను. చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా జరిగిందా మాఫీ? ఈయన చెప్పిన హామీలు.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. మీ అందరినీ కూడా చంద్రబాబు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా?
ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు నిరుద్యోగభృతి అన్నాడు. నెల నెలా ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా అందిందా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నా. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? మరో ముఖ్యమైన హామీ.. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడుచేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మీ ఏలూరులో కనిపిస్తోందా? మరి నేను మిమ్మల్నందరినీ ఒక్కటే అడుగుతున్నాను. ఆలోచన చేయండి.
ఈ ముఖ్యమైన హామీలంటూ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో.. చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ అమ్మేశాడు. మళ్లీ ఇవాళ ఏమంటున్నారు. మళ్లీ ఇదే ముగ్గురు, మళ్లీ ఇదే కూటమి, కొత్త మేనిఫెస్టో అంటూ మళ్లీ డ్రామాలు, మళ్లీ హిస్టరీ రిపీట్స్.. మళ్లీ సూపర్ సిక్స్ అంటున్నారు. సూపర్ సెవెన్ అంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి అబద్ధాలు చెప్పే వారితో యుద్ధం చేస్తున్నాం. అందరూ ఆలోచన చేయండి. ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ ఆలోచనచేయండి.
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కులం పరంగా కావచ్చు, లేకపోతే ఫలాన పార్టీకి మాకు అభిమానం అని అనొచ్చు. ఏదైనా కారణం కావచ్చు. కానీ అటువంటి వారికి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరంతా ఇంటికి వెళ్లండి. మీ భార్యలతో, మీ అవ్వాతాతలతో, మీ పిల్లలతో మాట్లాడండి. పిల్లలు కదా.. వాళ్లకు ఓటు లేదు కదా అని పక్కన పెట్టొద్దండి. వాళ్లతో కూడా మాట్లాడండి. మీ ఇంటి ఆడపడుచులతో మాట్లాడండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీకు మంచి జరిగింది అని ఒకే ఒకటి అడగండి.
ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అని వారందరినీ అడగండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఓటు వేయండి. ఎందుకంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు కావు. వచ్చే 5 సంవత్సరాల మీ తలరాతలు మార్చే ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.
వాలాంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మనవ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా.. చెడుచేసిన సైకిల్ ఎక్కడుండాలి?ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి.
ఈ రోజు ఈ మాటలన్నీ కూడా మీకు వివరంగా చెబుతూ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈరోజు మన వైయస్సార్ సీపీ తరఫున నిలబడుతున్న మన అభ్యర్థులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ, మీ జగన్ పై ఉంచవలసిందిగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరిచల్లని దీవెనలకు, ఆశీస్సులకు మరొక్కసారి శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని చెబుతూ సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.