2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో గెలిపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. ఇటీవల కూటమి తరుపున పోటీ చేయబోయే అనకాపల్లి పార్లమెంట్ నుంచి బిజెపి తరఫున సీఎం రమేష్, జనసేన పార్టీ నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే పంచకర్ల రమేష్ బాబు, కైకలూరు నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేయబోయే కామినేని శ్రీనివాస్ లను గెలిపించాలంటూ నియోజకవర్గ ప్రజలకు సందేశమిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. కాగా రాజకీయ విశ్లేషకులు నుంచి కొన్ని ప్రశ్నలు చిరంజీవికి ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కూటమి నేతలకి ఎలా మద్దతిస్తారంటూ అభిప్రాయపడుతున్నారు. గతంలో బిజెపిని హిందుత్వ పార్టీ అని అభివర్ణించిన చిరంజీవి, నేడు పద్మ విభూషణ్ రాగానే బిజెపి అన్ని మతాల పార్టీ అయిపోయిందా అని తీవ్రస్థాయిలో చిరంజీవి ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రశ్నలు చిరంజీవికి సంధించారు.
ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు , నీపార్టీ తరుపున అహర్నీశలు కష్టపడి భాధలు పడ్డ నీ అభిమానులు భాధ నీకు కనపడలేదా అని అడిగారు. రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చిన పవన్ కళ్యాణ్ , అన్నయ్య జెండా ఎత్తేసినా నేను మీ కోసం నిలబడతానని రాజకీయాల్లోనే కొనసాగాలి కానీ ఇద్దరూ కలిసి ఎందుకు దుకాణం సర్దేయాల్సి వచ్చిందో ప్రజలకు జవాబు చెప్పాలని ప్రశ్నించారు.
నిజాయితీ గా నిబద్దతతో ఒంటరిగా పోరాడతా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు కూటమితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో కులతత్వ మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోనన్న పవన్ కళ్యాణ్ నేడు హిందుత్వాన్ని మాత్రమే ప్రోత్సహించే బిజెపితో ఎందుకు జతకట్టాల్సి వచ్చింది చిరంజీవి.
నా తల్లి దూషించిన వాళ్లను నేను క్షమించను అన్న పవన్ కళ్యాణ్ నేడు అన్ని మర్చిపోయి మీ తల్లిని దూషించిన వాళ్ల తో జత కట్టినప్పుడు మీకు భాధ అనిపించలేదా చిరంజీవి అని ప్రశ్నించారు. కులాలని, అభిమానుల్ని తాకట్టుపెట్టే నీలాంటి, మీ తమ్ముడు లాంటి వ్యక్తులని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.