ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల అసెంబ్లీ గత మూడు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరికి ఆసక్తిని కలిగించింది. బహుశా ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం లాంటి నేతల మధ్య పోటీ వల్ల ప్రజల్లో ఆసక్తి కలిగి ఉండొచ్చు. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ 2014 లో ఇండిపెండెంట్ గా చీరాలలో పోటీ చేసి గెలిచారు. 2019 లో వైసీపీ నుండి పోటీకి దిగిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కరణం బలరాం మీద ఓడిపోయారు. అ తరువాత జరిగిన సంఘటనలతో కరణం బలరాం కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ కి ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. ఈసారి 2024లో చీరాల వైసీపీ అభ్యర్ధిగా కరణం వెంకటేష్, టీడీపీ నుండి మాలకొండయ్య యాదవ్ , కాంగ్రెస్ పార్టీ నుండి లేదా ఇండిపెండెంట్ గా ఆమంచి కృష్ణమోహన్ రంగంలో వుండబోతున్నారు. ముగ్గురి మధ్య ఎన్నికల సమరం మంచి వాడి వేడిగా వుండబోతుంది.
2019లో కరణం బలరాం కి చీరాల నియోజకవర్గం లో మొత్తం పోలైన ఓట్లు 1,56,163 ఓట్లకు గాను చీరాల మండలంలో కరణం బలరాం కి 31,482 ఓట్లు రాగా అమంచికి 22,530 ఓట్లు పోలాయినయి. చీరాల మండలంలో కరణం బలరాం కి 8952 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక చీరాల పట్టణంలో కరణం బలరాం కి 26,201 ఓట్లురాగా, ఆమంచికి 21,772 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కరణం బలరాంకి 4429 ఓట్ల మెజారిటీ వచ్చింది. వేటపాలెం మండలంలో కరణం బలరాంకి 25480 ఓట్లు వచ్చాయి. ఆమంచి కృష్ణమోహన్ కు 20947 ఓట్లు వచ్చాయి ఇక్కడ కరణం బలరాంకి 4533 ఓట్ల మెజారిటీ వచ్చింది.మొత్తంగా నియోజకవర్గంలో కరణం బలరాంకి 17,421 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాని తరువాత కరణం బలరాం వైసీపీ లో జాయిన్ అయ్యి నియోజక ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరుకు ఇంచార్జీగా వైసీపీ అధినేత జగన్ పంపించారు. కానీ పర్చూరులో పోటి చెయ్యలేనని భావించిన ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ కి రాజీనామా చేసి ఈ నేల 12న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఇక టీడీపీ తరపున మాలకొండయ్య పోటీలో ఉండబోతున్నారు. వైసీపీ తరుపున కరణం బలరాం వారసుడు కరణం వెంకటేష్ పోటిలో నిలబడుతున్నారు.
ఇప్పటికే ముగ్గురు నాయకులు నియోజకవర్గం అంతటా తిరిగి తమ అభిమానులతో, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. కరణం వెంకటేష్ ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ది పనులను , చీరాలలో చేసిన సామజిక న్యాయాన్ని గడప గడపకు కు తీసుకువెళ్ళి ప్రచారం కూడా ఒక రౌండ్ పూర్తి చేసారు. టీడీపీ మాలకొండయ్య సూపర్ సిక్స్ పేరుతో తమ పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు కానీ ఉమ్మడి కూటమి జనసేన పార్టీ, బిజెపి నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతున్నారు కానీ కాంగ్రెస్ మీద రాష్ట్ర ప్రజలకు వున్న వ్యతిరేకత తనకు నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఆలాగే తన తమ్ముడు మీద నియోజకవర్గ ప్రజలకు వున్న కోపం కూడా ఇబ్బంది కలిగేలా వున్నాయి. రానున్న ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో ముగ్గురి మధ్య ఉత్కంఠ పోరు ఉండబోతుంది.