ఏపిలో నామినేషన్ ప్రక్రియ వేగవంతం అయింది. ఈరోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులు క్యూ కట్టి తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ అఫిడవిట్లులో సమర్పించిన వివరాలు చూస్తున్న రాజకీయ పరిశీలకులు అవాక్కు అయ్యేట్టు చింతామనేని నెలకొల్పిన మరో భారీ రికార్డు బట్టబయలు అయింది. రాష్ట్రంలోని అభ్యర్ధుల మీద ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్యను చూస్తే అత్యధికంగా చింతమనేని ప్రభాకర్ మీద 93 కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది. ఇది రాష్ట్రంలోనే రికార్డు. రౌడీ షీటర్ గా ఎమ్మెల్యే పోటిలో వున్న వ్యక్తిగా ఇప్పటికే చింతమనేని రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు అత్యధిక కేసులతో మరో భారీ రికార్డు నెలకొల్పడంతో పరిశీలకులు అవాక్కవుతున్నారు.
చింతమనేని దూకుడు, క్రిమినల్ చర్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ కేసులు నమోదు చేపించుకుంటూనే వున్నారు. చింతమనేని మీద వట్టి వసంతకుమార్ మీద దాడి చేసిన ఘటనలో ఇప్పటికే రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడింది . అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో ఇప్పుడు పోటీలో నిలుస్తున్నారు. అంతే కాకుండా అడ్డువచ్చిన ప్రతీ అధికారి మీద దాడులు చేసిన ఘనత చింతమనేనిది. వాటిలో ముఖ్యమైనవి కొల్లేరులో అటవీ శాఖ అధికారులు, ముసునూరులో అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న వనజాక్షి మీద దాడి చేసిన ఘటన ఇవే కాకుండా దెందులూరు అక్రమ ఇసుక, మైనింగ్ అడ్డుకున్నారని ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేసిన కేసులు , పోలీసులు , ట్రాఫిక్ పోలీసుల మీద తన దూకుడు క్రిమినల్ చర్యలతో ఇబ్బంది పెట్టడంతో పలు కేసులు నమోదు అయ్యాయి.
ఇక సాధారణ పౌరుల మీద చేసిన దాడులకు లెక్కే లేదు అని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం .నేను రౌడీ షీటర్ అని తెలిసే చంద్రబాబు నాయుడు నాకు టికెట్ ఇచ్చారు అంటూ దానిని గొప్పగా చెప్పుకున్న వ్యక్తిత్వం చింతమనేని ప్రభాకర్ ది. ఈ 93 కేసుల్లో అత్యధిక కేసులు నమోదయ్యింది చంద్రబాబు ప్రభుత్వంలోనే, అప్పట్లో కొల్లేరులో, దెందులూరులో చింతమనేని ప్రభాకర్ కు ఎదురు వుండేది కాదు. బాబు హయాంలో తను అడిందే ఆట పాడిందే పాటగా వుండేది. తరువాత జగన్ ప్రభుత్వంలో ఆ కేసుల మీద చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అంటూ చింతమనేనికి టీడీపీ,చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిన ఘటనలు వున్నాయి .