ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంతో పాటు ప్రలోభాలకు తెరలేపారు. నర్సీపట్నం లో టీడీపీఅభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఎలక్షన్ నియమావళి అతిక్రమించి అనుమతులు లేకుండా ప్రచార సభను నిర్వహించి పార్టీ ముఖ్య నేతలకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని వచ్చిన అధికారులు పోలీసులను చూడగానే చింతకాయల విజయ్ అక్కడి నుండి పలాయనం చిత్తగించారు. ఈ ఎలక్షన్ తన తండ్రి చింతకాయలు అయ్యన్నపాత్రుడుకి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా చివరి అవకాశం అవ్వడంతో పాటు ఈసారి ఓడిపోతే రాజకీయంగా నర్సీపట్నంలో తాము కనుమరుగు అవుతాము అలాగే తన రాజకీయ భవిష్యత్ అంతం అవుతుంది అని భయపడిన చింతకాయ విజయ్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెర లేపాడు.
ఇక నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం గ్రామంలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భూత్ లెవల్ కార్యకర్తలకు డబ్బులను పంపిణీ చేస్తున్నారు అని తెలుసుకొని నాతవరం ఎస్ఐ , ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు అ మీటింగ్ ప్రదేశానికి వెళ్లగా వీరి రాకను పసిగట్టిన చింతకాయల విజయ్ కారులో పారిపోయారు, మిగతా టీడీపీ నాయకులు , కార్యకర్తలు జీడీ తోటలోకి తలోదిక్కు పరుగు లంకించుకున్నారు.
అక్కడి సామాగ్రిని అధికారులు సీజ్ చెయ్యబోతుంటే పై నుండి ఫోన్లు రావడంతో వదిలేశారు.
ఈ ప్రలోభాల మీద నర్సీపట్నం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి జయరాంకు నర్సీపట్నం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అయిన పిట్ల గణేష్ ఫిర్యాదు చేశారు. అలాగే నాతవరం ఎస్ఐ కు ZPTC సభ్యురాలు నర్సమ్మ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో చింతకాయల విజయ్, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ , మాజీ ఎంపీపీ సన్యాసిదేముడు మరికొంత మంది టీడీపీ నాయకుల వివరాలను పోలిసులు , అధికారులు పై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఇదే విషయంపై చింతకాయల విజయ్, టీడీపీ నాయకుల మీద తొందరగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా టీడీపీ ప్రలోభాలను ఆపాలని వైసీపీ శ్రేణులు నాయకులు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులను , పోలీసులను కోరుతున్నారు.