వైఎస్ జగన్ హామీలు అమలుచెయ్యలేదంటూ ఛార్జిషీట్ వేసిన చంద్రబాబు
ప్రజాకోర్టుకు జగన్.. ఎన్నికల హామీల మోసాలపై తెదేపా చార్జిషీట్ వేస్తున్నమంటూ.. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చరిత్రలో అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ నిలిచి పోతాడంటూ చంద్రబాబు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు.
ఒక్కసారి గతం చూసుకుంటే 2014 ఎన్నికలలో గెలిచేందుకు దాదాపు 600 అబద్ధపు హామీలిచ్చి అవి అమలు చెయ్యకుండా ప్రజలలో దిగజారిపోయిన పార్టీ టీడీపీ.. చివరికి తమ పార్టీ డొల్లతనం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో టీడీపీ మేనిఫెస్టోను కనపడకుండా తొలగించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు.. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం హామీలు అమలు చెయ్యలేదంటూ చార్జిషీట్ వేస్తున్నారంట.. గడిచిన 56 నెలల పరిపాలనా కాలంలో మేనిఫెస్టోలో 98.5% హామీలను అమలు చేసి ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం అంటూ అన్ని రంగాలలో ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు తోడుగా నిలుస్తుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. రానున్న 2024 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక టీడీపీ అడ్డగోలు ఆరోపణలు చేస్తుంది.
టీడీపీ పార్టీ తమ పార్టీ మేనిపెస్టోను చిత్త కాగితంలా మార్చేసి ప్రజలను మోసం చేస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. కరోనా లాంటి క్లిషసమయంలో కూడా మేనిఫెస్టో హామీలు అమలుచేస్తూ వచ్చారు వైఎస్ జగన్. మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనత దశదిశలా వ్యాపిస్తుంటే.. చరిత్రలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచిపోయాడు.