Cheating Case : వేసేది న్యూట్రల్ జర్నలిస్టు వేషం. చేసేది మాత్రం ఓ రాజకీయ పార్టీకి ఊడిగం. ప్రత్యేకించి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అనునిత్యం బురదజల్లే టీవీ5 సాంబశివరావుపై చీటింగ్ కేస్ నమోదైంది. ఫోర్జరీ సంతకాలతో తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదైంది. వివరాల్లోకి వెళితే
మీడియాలో పనిచేయడంతో పాటుగా సాంబశివరావు పెట్రోలు బంకుల నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం తమకు తెలియకుండానే హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ కు స్థలాన్ని లీజుకు ఇచ్చారని ఫోర్జరీ సంతకాలతో లీజు డాక్యుమెంట్లు సృష్టించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో బాధితుడు సరనాల శ్రీధర్ పేర్కొన్నారు. దీంతో టివీ5 సాంబశివరావుపై, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా టీవీ5 కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సాంబశివరావు గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్టీలో లం*ముం*లేరా అంటూ ఒక లైవ్ డిబేట్ లో వ్యాఖ్యానించడంతో సాంబశివరావుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సాంబశివరావు వ్యాఖ్యలను ఖండించారు. అదేవిధంగా దొమ్మరి కులానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పటికీ జర్నలిస్టుగా కాకుండా ఒక పార్టీకి కొమ్ముకాస్తున్న వ్యక్తిగానే అతని డిబేట్లు కొనసాగనుండటం గమనార్హం. కాగా ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో ఇదంతా వైఎస్సార్సీపీ చేసిన కుట్రలో భాగం అంటూ టీవీ5 సాంబశివరావు ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ హైదరాబాద్ లో యజమానికి తెలియకుండా సాంబశివరావు స్థలాన్ని లీజుకిస్తే దానికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.