ఎన్టీఆర్ కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, ఎన్టీఆర్కన్నబిడ్డలు, చివరికి ఎక్కడో నారవారిపల్లె అనే చిన్న ఊర్లో పుట్టిన ఎన్టీఆర్ తో ఏ రక్త సంబంధం లేని బాబు వశం అయ్యాయి. ఏ కష్టం లేకుండా సీఎం అయ్యాడు, అయినా అధికార దాహం తీరలేదు. తను సార్వభౌముణ్ణి అనీ, తనపై వేరే ఏ అధికారం ఉండరాదని భావిస్తాడు…
ఎన్టీఆర్ ని గద్దె దించి తను ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమే అప్పటి గవర్నర్ కృష్ణకాంత్, తర్వాత బాబు మద్దతుతో ఆయన ఉపరాష్ట్రపతి కూడా అయ్యాడు అది వేరే విషయం.. అలాంటి గవర్నర్ వ్యవస్థ కాస్త సక్రమంగా పని చేస్తే బాబుకు సహించలేదు.. రాష్ట్రంలో అసలు గవర్నర్ అనే పదవి ఉండకూడదు అనీ, కేంద్రం అధికారాలు తగ్గించాలని, ఆర్టికల్ 365 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విందించే అధికారాన్ని రద్దు చేయాలని అంతర్రాష్ట్ర మండలిలో సుదీర్ఘ ప్రసంగం చేశాడు బాబు.
కేంద్రం కేవలం రక్షణ బాధ్యత మాత్రమే చుస్కోవాలని, రాష్ట్రాలకు అన్ని అధికారాలు బదిలీ చేయాలని, కేంద్ర పథకాలన్నీ రద్దు చేసి ఆ నిధులు రాష్ట్రానికే ఇవ్వాలని కూడా వాదించాడు, ఎందుకంటే తనపై ఎవరు అధికారం చెలాయించాడానికి ఆయన మనసు ఒప్పుకోదు, కేంద్రం పథకాలు ఇస్తే ఈయన జేబు నిండదు, అదే నిధులు ఇస్తే జన్మభూమి కమిటీ ల ద్వారా పక్క దారి పట్టించొచ్చు. బాబు హయాంలో పేరు కు చెప్పుకుందాం అన్న ఒక్క పథకం ఉండదు కాని కేంద్రం చేతిలో అధికారాలు ఉండరాదు, పథకాలు ఇవ్వరాదు, అన్నీ తానే, అన్నిటికీ తానే మూలం అవ్వాలి అనే ఫాసిస్టు భావజాలం ఆయనది..
అధికారం లో లేకపోతే మాత్రం అన్నిటిలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నెలకోసారి డిమాండ్ చేస్తుంటాడు…