ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుపై విధానపరమైన విమర్శలను మాత్రమే చేశానని, వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు. తాను ఎప్పుడు తన స్థాయిని మరిచి మాట్లాడలేదని, చంద్రబాబుకి వయసు పెరిగింది గానీ, ఏం మాట్లాడాలో తెలియదంటూ చురకలు అంటించారు. మీ తీరుని ప్రశ్నిస్తే తాను బూతుల నానినా అని ప్రశ్నించారు. తన కొడుకు కృష్ణమూర్తిపై గంజాయి నిందలు మోపుతారా అని మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాలుగా మచిలీపట్నం ఇద్దరు నేతలకు గుర్తు రాలేదా అంటూనే, కరోనా సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వాళ్ళు ఇళ్లల్లో తలుపులు వేసుకొని కూర్చుంటే ఆరోజు నా కొడుకు ప్రతి గడపను తప్పి కరోనా బారిన పడినవారికి భరోసా కల్పించానని వెల్లడించారు. ఆరోజు మచిలీపట్నం వాసుల బాగోగులు గుర్తుకు రాలేదు కానీ ఎలక్షన్ రాగానే వారి బాగోగులు గుర్తుకొచ్చాయా అంటూ ప్రశ్నించారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బందరుకు ఏం చేశారని అడిగారు. ఎన్నికల ముందు హడావుడిగా ఏ పర్మిషన్ లేకుండా పోర్ట్ కు శంకుస్థాపన చేసే వెళ్లిపోయాడు. మళ్లీ ఎన్నికలు రాగానే ఏం చేసావ్ అని వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్ట్ నిర్మాణానికి అడ్డంకులున్న పిటిషన్లన్నీటికి కోర్టులో క్లియరెన్స్ తెచ్చుకొని శంకుస్థాపన చేశామని పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మేము చేస్తున్న అభివృద్ధి బందర్ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, అదనంగా మచిలీపట్నానికి మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చామని మెడికల్ కాలేజ్ తో పాటుగా కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించామని వ్యాఖ్యానించారు. 26 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు. బాబు హయాంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న మచిలీపట్నం కొచ్చి జిల్లా కలెక్టర్లు జెండా ఎగిరేసే పరిస్థితి లేదని, అలాంటిది కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మార్చి బందరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తీసుకొచ్చి పూర్వవైభవం తెచ్చింది వైఎస్ జగన్ అని కీర్తించారు. కేవలం రాజకీయ పరంగా, విధాన పరమైన నిర్ణయాల్లో విమర్శించామే తప్ప వ్యక్తిత్వ హననం చేయలేదని గడిచిన ఐదేళ్ల కాలంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం తనకు ఉందని దశాబ్దాలుగా కాదు శతాబ్ధాలుగా మచిలీపట్నం వైభవానికి ఉన్న మసకను తొలగింది కేవలం సీఎం జగన్ అని దమ్ముగా చెప్పగలననని చంద్రబాబు మచిలీపట్నంకి చేసింది శూన్యం అని పేర్ని నాని వెల్లడించారు.