ఉద్యోగులు అంటే చంద్రబాబుకి టిడిపికి ఎప్పుడూ చులకనే!
చంద్రబాబు పరిపాలన మొదలు రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు టిడిపి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమాత్రం అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ఉద్యోగులు అంటే చంద్రబాబుకి ఎప్పుడు చులకనే అనే మాట మనం చెబుతున్నది కాదు చరిత్ర చెబుతుంది. చంద్రబాబు పరిపాలన మొదలు రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు టిడిపి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమాత్రం అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన 14 ఏళ్ల ముఖ్యమంత్రి గిరిలో ఉద్యోగులు పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాడు అనేది ప్రతి ఉద్యోగికి అనుభవమే… ఉద్యోగులు అంటే చంద్రబాబుకి మాత్రమే కాదు చంద్రబాబు అనుకూల మీడియా అయినటువంటి ఎల్లో మీడియాకు కూడా చాలా చులకన అనేది తెలిసిన విషయమే…
ప్రభుత్వ ఉద్యోగులు అంటే.. చంద్రబాబు, అతని అనుకూల మీడియా ఏబీఎన్ రాధాకృష్ణకు ఎంత చులకన భావమో ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఈ నా కొడుకులకి జీతాలు ఇవ్వడానికా ప్రజలు పన్నులు కడుతున్నది ?’ అని చంద్రబాబు ముందే తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ఏబీఎన్ రాధాకృష్ణ.. ఆ సమయములో రాధాకృష్ణను బాబు కనీసం మందలించలేదు సరి కదా అలా అనడం తప్పు అని వారించడం కూడా లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబుకు ఎల్లో మీడియాకు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎంత గౌరవం ఎంత మర్యాద అనేది.
అంతేకాకుండా గతంలో ‘మనసులో మాట’ అనే పుస్తకంలో చంద్రబాబు స్వయంగా రాసుకున్న మాటలు చూస్తే ‘ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం చెల్లిందని, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ వంటి శాఖల్లో అవినీతి విచ్చలవిడి అయిపోయిందని, వీటిని నియంత్రించాలంటే ఇతర దేశాల్లో మాదిరిగా ప్రైవేటేషన్ ఒక్కటే మార్గమని, ప్రభుత్వ ఉద్యోగాలకు స్వస్తి పలికి ఔట్సోర్సింగ్ కింద తీసుకుంటే సోమరితనం తగ్గుతుందని, అప్పుడు ఉద్యోగులంతా ఉద్యోగ భద్రత లేకుండా ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేస్తారు’ అని ఆ పుస్తకంలో రాసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు పరిపాలనలో ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ప్రభుత్వ ఉద్యోగులపై చూపించే చులకన భావానికి అనేక ఉదాహరణలు తారసపడుతూనే ఉంటాయి.