అధికారంలో ఉంటే రాష్ట్ర సహజ వనరులను, సంపదను తన సొంత ఆస్తిలా భావించి, వాటిని ఇష్టారీతిన అమ్మేసి, అందులో వాటాలు తీసుకోవడం బాబు కు ఆనవాయితీ.. అది ఆయనకు ముందు నుండీ ఉన్న సహజ సిద్ద స్వభావం. 1995 లో మొదటిసారి సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుండి తన దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది.
1996 లో అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న బైరేటీస్ గనులను నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు వ్యక్తులకు కేటాయించి ఏటా రాష్ట్ర ఖజానాకు 15 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లేలా చేసిన ఘటన గురించి ఆనాడు పత్రికలు కోడై కూసాయి. అయినా నిమ్మకు నీరెత్తినట్టు వాటి పై ఎలాంటి సమీక్ష చేయకుండా రాష్ట్ర సంపదను విచ్చల విడిగా కొల్లగొట్టారు..
ఇది కేవలం శాంపిల్ మాత్రమే, అధికారంలో ఉన్న ప్రతీ సారి అదే తంతు. గ్రానైట్ రాయి మొదలు సున్నపు రాయి వరకు ఏది వదలకుండా భూమిని తవ్వి పడేశాడు. 2002 లో ఓబుళాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డి కి కేటాయిస్తూ జీవో ఇచ్చింది బాబే. 2014 నుండి 19 మధ్యలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సున్నపు రాయి మైనింగ్ లో చేసిన 17 మైనింగ్ అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటుంది అన్న కారణం తో ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని కొడితే పిలిచి పంచాయితీ చేసి వనజాక్షి దే తప్పని తీర్పునిచ్చాడు. బాబు హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై విచారణ చేయదలచి ఏపీ సీఐడీ కేసు ఫైల్ చేయగా దానిపై బాబు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు..
2004 కు ముందు విశాఖ లో బాక్సైట్ తవ్వకాలకు అన్నిరకాల అనుమతులు ఇచ్చి అక్కడ స్థానిక గిరిజన జాతులపై ఉక్కుపాదం మోపగా అప్పటి ప్రతిపక్షాల ఒత్తిడితో అది ఆగిపోయింది. వైయస్సార్ హాయంలో అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరపకుండా నిషేధం విధిస్తే, 2014 లో అధికారం లోకి రాకముందు మేం అధికారంలోకి వస్తే విశాఖ లో బాక్సైట్ తవ్వకాలు జరగకుండా అడ్డుకుంటాం అని అధికారంలోకి వచ్చిన ఏడాదికే బాక్సైట్ తవ్వకం అత్యంత అవసరం అనీ స్థానికులని ఒప్పిస్తాం అని ప్రకటించి బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చాడు. అధికారంలో కి రాగానే జగన్ ప్రభుత్వం ఆ బాక్సైట్ తవ్వకాను నిలిపివేసింది..
ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు అక్రమ మైనింగ్ ఘటనలు ఆయన 14 ఏళ్ల సీఎం గిరి లో కోకొల్లలుగా కనిపిస్తాయి..