సినిమాల్లో పేజీలకు పేజీలు నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో మాత్రం వాటికి కిలోమీటర్ల దూరంలో ఉంటాడని మరోసారి రుజువైంది. తనకు డబ్బే ప్రధానమని, ప్రజాశ్రేయస్సు పట్టదని చేతల్లో చూపించాడు. వడదెబ్బ తగిలింది.. రెస్ట్ కోసమంటూ నేతలు, కార్యకర్తల్ని ఏమార్చి హైదరాబాద్‌కు వెళ్లిన సేనాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీని వైట్ చేసుకోవడం, ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టే పనులు చేశాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందాన సొంత అన్న చిరంజీవికి కూడా కొంత భాగం ఇచ్చినట్లు తెలిసింది.
పవన్ సోమవారం చిరంజీవిని కలిశాడు. ఈ సందర్భంగా చిరు రూ.5 కోట్లు జనసేన కోసమంటూ తమ్ముడికి ఇచ్చాడు. చెక్కు అందుకున్న సేనాని అన్న కాళ్లపై పడ్డాడు. ఈ వ్యవహారమంతా మెలో డ్రామాను తలపించింది. అసలు దీని వెనుక కథేంటని ఔత్సాహికులు ఆరాతీస్తే జనసేన అధినేత బాగోతం బయటపడింది. పొత్తు పెట్టుకున్నందుకు, తక్కువ సీట్లు తీసుకున్నందుకు, చెప్పినట్లు ఆడుతున్నందుకు చంద్రబాబు పవన్‌కు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ మొత్తాన్ని పవన్ తన ఖాతాలో వేసుకోవాలి. పన్ను ఎగ్గొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా కుట్రకు తెరతీశాడు.
చిరంజీవి కాల్షీట్ తీసుకున్నాడు. ఆయనకు రూ.5 కోట్లు అందజేసి.. వాటినే తనకు చెక్కు రూపంలో ఇవ్వాలని పవన్ చెప్పాడు. దీనికి జనసేనకు డొనేషన్ అని పేరు పెట్టారు. ప్రజాసేవ కోసమంటూ మెగా బ్రదర్స్ బిల్డప్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే ఇన్‌కమ్‌ట్యాక్స్ సెక్షన్ 80 జీజీసీ ప్రకారం రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇచ్చిన మొత్తానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్‌ను సేనాని బాగా వినియోగించుకున్నాడు. రూ.5 కోట్లకు సంబంధించిన మిగిలిన పన్ను డబ్బును పవన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
జనసేనకు విరాళాల తంతు మొత్తం ఇలాగే జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. ఇప్పుడు బయటికి చిరంజీవి సపోర్టు చేసి సొంత డబ్బు ఇచ్చాడని కనిపిస్తుంది. కానీ లోపల జరిగిందంతా పవన్ అక్రమ సంపాదన వ్యవహారమే. అలాగే కాల్షీట్ ఇచ్చి సోషల్ మీడియాలో సపోర్టు పోస్టులు పెట్టినందుకు చిరుకి కొంత ముట్టింది. సేనాని సినిమా హీరో కావడంతో చాలామంది ఆయనకు విరాళాలు ఇస్తున్నారు. కానీ దీనివెనుక చంద్రబాబు ప్యాకేజీని వైట్ చేసుకునే కుట్ర ఉంది. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టే మతలబు ఉందని తెలుస్తోంది.
పవన్ పూర్తిగా డబ్బు మనిషి. జనసేనను పెట్టిందే అందు కోసం. అటు సినిమాలు.. ఇటు రాజకీయాల్లో విపరీతంగా సంపాదిస్తున్నాడు. జనసేన నాయకులకు అన్యాయం చేసి టీడీపీ వారికి, చంద్రబాబు చెప్పినోళ్లకి సీట్లు ఇచ్చి బాగా కూడబెట్టాడు. అలాగే బాబు ప్యాకేజీ ఇచ్చాడు. కానీ సినిమాలు, రాజకీయ సభలు, సమావేశాల్లో నీతులు చెబుతూ తన ఫ్యాన్స్‌ను గొర్రెలు చేస్తూనే ఉంటాడు.