నిన్నటి రోజున స్కిల్ స్కామ్ కేసుకి సంబంధించి, 17a వర్తింపు గురించి.. ఇద్దరు న్యాయమూర్తుల బృందం భిన్నాభిప్రాయాలు తీర్పులో వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ అనిరుధ్ బోస్‌తో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయాలు తెలుపడంతో ఆ కేసు తీర్పును చీఫ్ జస్టిస్ బెంచ్‌కి ట్రాన్స్ఫర్ చేసారు. అయితే ఇద్దరూ న్యాయమూర్తులు చంద్రబాబు అరెస్టుని మాత్రం సమర్థించారు. కాగా, ఈ రోజు ఈ ఇద్దరు న్యాయమూర్తులు ముందు చంద్రబాబు నిందితుడిగా ఉన్న మరొక కేసు రానుంది.
ఫైబర్ నెట్ స్కామ్.
ఫైబర్‌నెట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 114 కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనాన్ని పక్క దారి మళ్ళించారని సీఐడీ ప్రధాన ఆరోపణ. 2015 నుంచి 2018 వరకూ సాగిన ఈ కుంభకోణంలో, 2000 కోట్ల ప్రోజెక్టులో మొదటి దశగా 333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు నిబంధనలకు వ్యతిరేకంగా కాంట్రాక్టులను కట్టబెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వాస్తవానికి ఫైబర్‌నెట్ అనేది ఐటీ శాఖకు సంబంధించిన పని అయినా దానిని చంద్రబాబు తనకు నచ్చిన విధంగా తన వద్దనున్న శాఖల నుంచి పనులు మొదలుపెట్టారు.
ఫైబర్‌నెట్ టెండర్లను తన బినామీ అయినా హరికృష్ణ ప్రసాద్ కు చెందిన “టెరా సాఫ్ట్” అనే కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టారు. టెరాసాఫ్ట్ అనే కంపెనీ అప్పటికే బ్లాక్ లిస్ట్‌లో ఉంది కూడా. అంతే కాక ఈ సదరు హరికృష్ణకు నేర చరిత్ర ఉన్నా కూడా అంతకు ముందే ప్రభుత్వంలోని రెండు కీలక పదవుల్లో కూడా నియమించారు. అప్పట్లో ఆయన నియామకాల పట్ల తీవ్ర అభ్యంతరాలు వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆయన కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చే క్రమంలో దానిని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి ప్రజాధనం మేయడానికి అనువుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆపై మెల్లగా ధనం తమ సొంత జేబుల్లోకి వెళ్ళేలా చేసారు. మరి ఇంత జరిగిన ఫైబర్ నెట్ స్కాం పై సుప్రీం కోర్టు జడ్జిలు ఈ రోజు ఏ రకంగా తీర్పుని ఇస్తారో అని సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.