జగన్ హయాంలో కొత్తగా కడతున్న, పూర్తి చేసుకున్న 17 మెడికల్ కాలేజీల విషయం లో పాపం పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడ్డ టీడీపీ సోషల్ మీడియా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక పాపం పిచ్చి పిచ్చి వాదనలను తీసుకొస్తుంది… అసలు ఒక్క మెడికల్ కాలేజీ లేనట్టుగా… బాబు హయాంలో “ఫుల్లుగా” మెడికల్ కాలేజీ లు వచ్చినట్లుగా ఒక పోస్టర్ ను పట్టుకు ఆన్లైన్ లో తచ్చాడుతున్నారు…
బాబు తెచ్చిన ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలట:
1.అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్..
2.పద్మావతి మెడికల్ కాలేజ్..
3.ఎయిమ్స్, మంగళగిరి
4.ఏ.సి సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల.
5.ఎన్నారై మెడికల్ కాలేజ్.
6.అల్లూరి సీతారామరాజు మెడికల్ కళాశాల.
7.కాటూరి వైద్యకళాశాల.
8.కోనసీమ వైద్యకళాశాల.
9.నారాయణ వైద్య కళాశాల.
10.పీఈఎస్ వైద్య కళాశాల.
11.మహారాజా వైద్యకళాశాల.
12.జీ ఎస్ ఎల్ వైద్య కళాశాల..
ఇవన్నీ పాపం బాబు తెచ్చినవట కాటూరి, కోనసీమ, నారాయణ, పీ ఈ ఎస్, మహారాజా, జీ ఎస్ ఎల్, ఎన్నారై, అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజీ లు ఇవన్నీ ప్రైవేటు వాళ్ళవి… ఇందులో బాబు ఘనత ఎందో ప్రైవేటు మెడికల్ కాలేజీలు బాబు క్రెడిట్ లో ఎలా వేసుకున్నారో వాళ్ళకే తెలియాలి..
ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే:
1.అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎష్టాబ్లిష్ అయింది 1981 లో… అంటే అప్పటికి టీడీపీ పార్టీనే పుట్టలేదు…
2.పద్మావతి మెడికల్ కాలేజీ శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ వారి expansion లో భాగం గా అంటే టీటీడీ వారు నిర్మించింది.. ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు.
3.ఎయిమ్స్.. ఇది విభజన హామీ లో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టు. రాష్ట్రానికి ఏ సంబంధం లేదు.. రాయలసీమ లో నిర్మించాల్సింది తీసుకొచ్చి అమరావతి లో పెట్టాడు. బాబు ఎయిమ్స్ కడితే ఢిల్లీ ఎయిమ్స్ కూడా ఆయన ఖాతాలో ఏస్కోండి తప్పేం ఉంది…
4.ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ: దీన్ని 1968 లో జిల్లా ఆస్పత్రి గా నీలం సంజీవరెడ్డి హయాంలో శంకుస్థాపన చేస్తే కాసు బ్రహ్మానందరెడ్డి కాలం లో పూర్తయింది.. దీన్ని 2013 లో మెడికల్ కాలేజీ గా అప్గ్రేడ్ చేసి కొత్త నిర్మాణాలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభిస్తే..2014 మే లో సీఎం అయిన బాబు 2014 జూలై లో కట్టడాలు పూర్తయితే ప్రారంభోత్సవం చేసాడు… రెండే నెలల్లో మెడికల్ కాలేజీ కట్టేసాడని మెడికల్ మిరాకిల్ అంటారేమో టీడీపీ తమ్ముళ్లకే తెలియాలి…
ఇక జగన్ ప్రభుత్వం కట్టిన 17 మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయో చూపెట్టండి అంటూ తమ్ముళ్ల కామెడీ: ఎక్కడున్నాయంటే:
2019-09-15 నాడు:
విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, రాజమహేంద్రవరం. ఈ 5 చోట్ల కొత్తగా కట్టిన మెడికల్ కాలేజీలను సీఎం జగన్ ప్రారంభించాడు…
2024 నుండి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి… ఏది మీకు దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్లి ఉందో లేదో చూసుకోవచ్చు…
ఇంకో పన్నెండు లో:
పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె మెడికల్ కాలేజీలు దాదాపు పూర్తి కావొచ్చాయి, 2025 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి.. వీటిలో ఏది దగ్గరగా ఉంటే ఆ ఊరికి వెళ్లి పనులు ఎంతవరకొచ్చాయో చూడొచ్చు…
ఇక మిగిలిన 7 మెడికల్ కాలేజీ లు, పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ల, పెనుకొండ మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి 2026 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి…
ఇవేం దేవ రహస్యాలేమీ కావు, చాటుగా నిర్మాణాలు జరగట్లేదు… ఈ పదిహేడు ప్రాంతాల్లో ఏ ప్రాంతం అయినా వెళ్లి పలానా చోట మెడికల్ కాలేజీ నే కట్టట్లేదు అని నిరూపిస్తే సరిపోతుంది కదా? కళ్ళుమూసుకుని కనపడటం లేదు అనడం ఎందుకు?
పాపం ఎవరో ప్రైవేటు వాళ్ల కాలేజీలను మన ఖాతాలో వేసుకోడం, ఎప్పుడో కట్టిన మెడికల్ కాలేజీకి మనం క్రెడిట్ తీసుకోడం… ఇంత కష్టం మీకు రావడానికి కారణం ఎవరు తమ్ముళ్లు?? ఇంకెవరు ఆయనే…! ఆయనే గనుక అధికారం లో ఉన్నప్పుడు చక్కగా పాలించి, నాలుగు మెడికల్ కాలేజీలు కట్టించుంటే మీకీ తిప్పలు తప్పేవి కదా??