బహుశా నాడు జన్మభూమి కమిటీల పేరిట కార్యకర్తలకు వూళ్ల పై కర్ర పెత్తనం అప్పగించి ఐన వారికి పథకాలు పంచడంలో, అర్హులకి పథకాలు కావాలంటే లంచాలు ఇవ్వాలని, కోర్కెలు తీర్చాలని వేధించడంలో ఆరితేరిన కసాయిల పాలనతో తెస్తారా స్వర్ణయుగం .
అధికారం కోసం రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తా, వ్యవసాయ బంగారు రుణాలు మాఫీ చేస్తా అని ఓట్లేసిన తర్వాత ఎలా ఇస్తారు, ఎవరు చెప్పారు. జనాలకి అత్యాశ పనికి రాదు అని చేతులు ఎత్తేసి మళ్ళీ ఎలక్షన్ ల ముందు పసుపు కుంకుమ పేరున వడ్డీలకి కూడా సరిపోని చిల్లర పడేసే స్వర్ణయుగం తెస్తారా.
ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని, బిజినెస్ సమ్మిట్ల పేరిట నకిలీ mou లతో అయిదేళ్లు కాలక్షేపం చేసి ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నిరుద్యోగ భృతి అంటూ ఓటుకి నోటు చెల్లించిన స్వర్ణ యుగమా.
పట్టపగలు వనజాక్షి అనే ఎమ్మార్వోని అధికార ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఈడ్చడం, పుష్కరాలలో అమాయక భక్తులు ప్రాణాలు తీసి ఇలాంటి కార్యక్రమాలలో అలాంటి మరణాలు సాధారణమేగా అనడం, అమ్మాయిల వెంట మంత్రుల కొడుకులు వెంట పడి వేదించడం, ఇసుక తవ్వకాలు, కాల్ మనీ, ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాప్ లు సాధ్యమయ్యేది చంద్రబాబు పాలనలోగా….అదేగా బాబు గారూ మీరు చెప్పే స్వర్ణయుగం..