విజన్ 2020 అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు . ఇలా ఈ పేరు చంద్రబాబుతో ముడిపడిపోవడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎల్లో మీడియా . కానీ ఈ విజన్ 2020 నిజంగా చంద్రబాబు సృష్టేనా అని తరచి చూస్తే విస్తుపోయే నిజం వేరే ఉంది
ఆంగ్లంలో “ప్లేజిరైజ్” అనే ఒక పధం ఉంటుంది దాని అర్ధం మరొక వ్యక్తి యొక్క ఆలోచనలు లేదా పనిని సదరు వ్యక్తి అనుమతి లేకుండా తస్కరించి తమ స్వంతం అని ప్రచారం చేసుకోవడం. ఈ ప్లేజిరైజ్ అనే పదానికి అచ్చు గుద్దినట్టు సరిపోయే వ్యక్తి మన చంద్రబాబు . ఇందుకు అనేక ఉదాహరణలు,
అవేంటో వరుస క్రమంలో చూస్తే నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు మాధాపూర్ లో శంకుస్థాపన చేసిన టెక్నాలజీ పార్క్ తన ఘనతే అని చెప్పుకొన్నాడు.,1982లో ఇందిరా గాంధీ గారు ప్రారంభించిన డ్వాక్రా గ్రూపులు తన ఘనతే అని చెప్పుకున్నాడు. బాబు ముఖ్యమంత్రి కాకమునుపే 1995 ఆగష్టులో బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు గారు అప్పటి టెలికాం మంత్రిగా ఉన్న సుక్రం గారికి మొదటి మొబైల్ ఫోన్ కాల్ చేసి సెల్ ఫోన్ రివల్యుషన్ కి నాంది పలికారు. కానీ దేశంలోకి సెల్ఫోన్లు తెచ్చింది నేనే అని ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇలా పక్క వారి ఆలోచనలను, పనిని తన ఘనతలుగా ప్రచారం చేసుకొనే చంద్రబాబు ఆఖరికి దేశ సంపదగా కీర్తించబడ్డ మన అబ్దుల్ కలాం గారిని కూడా వదలలేదు.
చంద్రబాబు ఈ మధ్య ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ “విజన్ 2020ని నేనే మొదట తయారు చేశానని, అబ్దుల్ కలాం గారు తన దగ్గరికి వచ్చి మీరు విజన్ 2020ని ఎలా తయారు చేశారని అడిగి ఆ విజన్ 2020 ప్రతులని చూసి, దాని ఆధారంగానే దేశానికి విజన్ 2020ని తయారు చేశారని, దానికి సంభందించిన పుస్తకాలు కూడా తరువాత వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇది ఎంత పచ్చి అబద్దమో , తన ప్రచార పిచ్చితో ఆఖరికి అబ్దుల్ కలాం గారి లాంటి మహా వ్యక్తిని సైతం ఎంతలా అవమానించారో కాస్త లోతుగా ఈ వ్యవహారాన్ని పరిసీలిస్తే తెలుస్తుంది.
నిజానికి మొట్టమొదటిగా విజన్ 2020 అనే ఆలోచన చేసిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓ పదేళ్ల బాలిక అబ్దుల్ కలాం గారికి ఇచ్చిన సమాధానం కలాం గారిని విజన్ 2020 ఆలోచన వైపు అడుగులు వేసేలా చేసింది. కలాం గారి ప్రశ్నకు నాకు అభివృద్ధి చెందిన భారత్లో జీవించాలనుందని ఆ బాలిక చెప్పిన సమాధానమే 1997లో కలాం గారిచే విజన్ 2020 ని రూపొందించేలా స్ఫూర్తిని ఇచ్చింది.
1997 డిసెంబర్ 2వ తేదీన రవింద్రభారతిలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి ప్రధమ స్మారకోత్సవంలో అబ్దుల్ కలాం గారు ప్రసంగిస్తూ, 1992లో తాను డిల్లీ వెల్లిన తరువాత తనకి “టెక్నాలజీ ఇంఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్స్మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్.ఏసీ)తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని’ స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి దేశం ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే ఉందని దీనికి గల కారణాలను ఆ కౌన్సిల్ లో చర్చించేవాళ్ళమని, మన దేశం అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు ఒక ప్రణాళికను ఎందుకు రూపొందించకూడదనే ఆలోచనతోనే కొందరు నిపుణులతో కలిసి విజన్ 2020ని రూపొందించామని తెలిపారు.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరగడం, భారతరత్న అబ్దుల్ కాలం గారి విజన్ 2020 ప్రసంగం ప్రజలని బాగా ఆకట్టుకోవడంతో, వెంటనే ఆ పధాన్ని హైజాక్ చేసిన బాబు దాంతో పాటు చేసే ప్రతిపనిలో ఒక స్కాం కూడా కచ్చింతంగా ఉండాలి కాబట్టి విజన్ 2020 పేరున ఒక స్కాముకి కూడా తెరలేపారు చంద్రబాబు.
1998 నవంబర్ 24లో ఆంధ్రప్రదేశ్ శాశన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం సభ్యుడు అశోఖ్ గజపతి రాజు మాట్లాడుతూ విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని త్వరలో పూర్తి అవుతుందని చెప్పుకొచ్చారు. తర్వాత 1999 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సంధర్భంగా విడుదల చేశారు.
పులిని చూసి నక్క వాతపెట్టుకునట్టు అబ్దుల్ కలాం గారి విజన్ 2020 కార్యక్రమాన్ని చూసి అదే పేరుతో కాపీ కొట్టిన చంద్రబాబు తాను కూడా అబ్దుల్ కలాం అంత గొప్పవాడిగా ఇకపై దేశంలో కీర్తించబడుతానని ఊహించుకున్నాడు. కానీ తన అతి తెలివితేటలతో కాపీ కొట్టిన విజన్ ని మార్చి కిచిడి చేయడంతో కధ అడ్డం తిరిగి 2.5 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేసి అమెరికా కన్సల్టెంట్ “మకెన్సీ కంపెనీ” తో తయారు చేయించుకున్న ఆ 337 పేజీల విజన్ 2020 గవర్నర్ చేత అసంబ్లీ ప్రసంగంలో చదివించగానే నవ్వుల పాలయ్యాడు.
కొద్దికాలం తరువాత భారత పారిశ్రామిక సమాఖ్య హైద్రబాద్ లో ఒక సదస్సు ఏర్పాటు చేసింది, ఈ సదస్సుకి 25మంది స్విస్ వాణిజ్యవేత్తల బృందంతో స్విజ్జర్లాండ్ ఆర్ధిక మంత్రి పాస్కల్ కుప్పే పాల్గొన్నారు. ఈ సదస్సుకు వచ్చిన చంద్రబాబు తన విజన్ 2020 డాక్యుమెంట్ తీసుకుని చదవగానే కాసేపు విన్న స్విస్ ఆర్ధిక మంత్రి పాస్కల్ కుప్పే బాబు ప్రసంగానికి అడ్డు తగిలి మాదేశంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఇటువంటి అతిశయోక్తులు చెప్పరని, ఇలా ప్రజలని మోసం చేసే ప్రకటనలు, ఆచరణ సాధ్యంకాని పధకాలు ప్రచారం చేసే నీలాంటి రాజకీయ నాయకుడిని మా దేశంలో అయితే జైల్లో కానీ పిచ్చి ఆసుపత్రిలో కాని పెడతారని చంద్రబాబు విజన్ 2020 కాగితాల్లోని డొల్లతనాన్ని బయట పెట్టారు.
ఒక్క స్విస్ మంత్రే కాదు, ప్రపంచ ప్రఖ్యత రాజకీయ వక్త జార్జ్ మాంబిట్ కూడా చంద్రబాబు విజన్ 2020 లోని అంశాలని తూర్పారబట్టాడు. అలాగే అందరికి సుపరిచితుడైన సాయినాధ్ పాలగుమ్మి గారు కూడా విజన్ 2020 ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా విజన్ 2020 పేరున అన్నివైపుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కున్న చంద్రబాబు ఆ తరువాత కాలంలో వాటిని చెత్తబుట్టలో పడేశారు.
ఈ విజన్ 2020 కార్యక్రమాన్ని పరిసీలిస్తే ఇందులో మరో భారీ స్కాం కూడా దాగి ఉంది.
ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ బిజినెస్ వారు ఐఎస్బీ ఏర్పాటు చేస్తాం అని కర్నాటక, మహారాష్ట్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళగా, అక్కడి ముఖ్యమంత్రులు మీరు కోరిన భూమి ఉచితంగా ఇస్తాం కానీ మీరు ఇక్కడ విద్యార్దులకు 30 నుండి 50% కోటా తప్పనిసరిగా అమలుపరచాలని షరతులు విధించారు. కానీ చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వలే సొంత రాష్ట్ర విద్యార్ధుల గురించి ఆలోచించకుండా ఐఎస్బీ వాళ్ళకి 250 ఎకరాలు భూమిని కట్టబెట్టాడు. దీంతో ఎలాంటీ షరతులు లేకుండా ఉచితంగా 250 ఎకరాల భూమి దొరకడంతో ఐఎస్బీ వాళ్ళు హైద్రబాద్ లో క్యాంపస్ పెట్టారు.
ఈ ఐఎస్బీకి చంద్రబాబుకి మద్య రజత్ గుప్తా అనే వ్యక్తి మధ్యవర్తిత్వం నడిపాడు . ఈ రజత్ గుప్తా మకెన్సీ కంపెనీలో పనిచేసేవాడు. ఐఎస్బీ కి ఉచితంగా 250 ఎకరాలు కేటాయించి ఇక్కడ స్థాపించేలా డీల్ సెట్ చేసినందుకు రజత్ గుప్తా పనిచేస్తున్న మెకన్సీ కంపెనీకి విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసే కాంట్రాక్ట్ రూపంలో 1999లోనే 2.5 కోట్లు ఆ కంపెనీకి కట్ట బెట్టాడు. ఆ డాక్యుమెంట్ తరువాత చెత్త బుట్టలోకి వెళ్ళింది. ఈ రజిత్ గుప్తా మాత్రం అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో 2ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు.
ఇలా అబ్దుల్ కలాం గారి దగ్గర కాపీ కొట్టి కిచిడి చేసి రెండున్నర కోట్లు బూడిద చేసి తయారు చేసిన విజన్ 2020ని అబ్దుల్ కలాం గారే నా దగ్గర కాపీ కొట్టారని ప్రచారం చేసుకొన్న చంద్రబాబు, ఇటీవల మరో సభలో మాట్లాడుతూ తాను విజన్ 2020 అంటే తనను చంద్రబాబు 420 అని ఎగతాళి చేస్తున్నారని వాపోవడం విశేషం.