బాబు వెనక పవన్ నడుస్తున్నాడో, లేక పవన్ వెనుక బాబు పడుతున్నాడో తెలీదు గానీ, బాబు కి మాత్రం ఒక విషయం క్లారిటీ ఉంది.. సినిమా వాళ్లని చూడటానికి జనాలు వచ్చినట్లు, ఓట్లు వేయడానికి రారని బాబుకి ఒక అవగాహన ఉంది… అయితే గియితే ప్రచారంలో ఎక్సట్రా ఆర్టిస్ట్లు గా వాడుకోవచ్చు అనే అభిప్రాయం ఆయనది. ఇందుకు ఉదాహరణలు ఎన్నో.
1995 లో ఎన్టీఆర్ ను కూల్చి సీఎం సీట్ అధిరోహించిన బాబు, ఎన్టీఆర్ కష్టంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ని లాక్కుని చివరికి అసలు ఎన్టీఆర్ గ్లామర్ వల్ల టీడీపీ గెలవలేదన్నట్లుగా మాట్లాడాడు, సినిమా గ్లామర్ కి కాలం చెల్లిందని, కావాలంటే సినిమా వాళ్లు రాజకీయాల్లో విఫలం అవుతున్న ఉదాహరణలు చెప్తానని బాబు ఉవాచ…
అలాంటి బాబు నేడు పవన్ కల్యాన్ గ్లామర్ కోసం తనని దగ్గరకు తీసుకుని ఆటాడుకుంటున్నాడు… మళ్లీ అవసరం తీరాక కూరలో కరివేపాకు లా తీసేస్తాడు… అంతటి ఎన్టీఆర్ కే తప్పలేదు, ఇక పవన్ ఎంత?
ఇక ఇదే వార్తలో బాబు నైజమెలాంటిందో చూపే మరో ఉదాహరణ కూడా ఉంది.. తను ఎప్పుడు కాంగ్రెస్ కి, బీజేపీ కి దూరం అని, కమ్యూనిస్టు లు, లౌకిక వాదులతోనే కలిసి ప్రయాణం అని ప్రకటించిన బాబు తర్వాత 3 ఏళ్లలోనే బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాడు, 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్లీ బీజేపీ తో పొత్తుకు అర్రులు చాస్తున్నాడు..