మొన్న తెనాలి, నిన్న పిఠాపురం, నేడు శ్రీకాకుళం.. టీడీపీ లో భగ్గుమంటున్న లొసుగులు….
వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ను ఎప్పటి నుండో ధర్మాన ప్రసాదరావు కు ధీటుగా పోటీ లో ఉన్న గుండా కుటుంబానికి కాదని ఇప్పుడు గోండు శంకర్ కు కేటాయించారు.
టీడీపీ నియోజక వర్గ ఇంచార్జ్, 2014 లో ఎమ్మెల్యే గా గెలిచిన గుండా లక్ష్మీదేవికి కనీసం సమాచారం లేకుండా గోండు శంకర్ కు కేటాయించడం తమను అవమానించడమే అని, బాబు 30 కోట్లు తీసుకుని టీడీపీ టికెట్ ను అమ్ముకున్నాడని లక్ష్మీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా లక్ష్మి దేవి ఆఫీస్ నుండి బాబు ఫోటో ను తొలగించి వాటిని తగలబెట్టిన ఆమె వర్గీయులు, పోటీ పై వెనక్కి తగ్గేది లేదని, లక్ష్మీదేవిని ఎలా అయినా ఇండిపెండ్ గా పోటీ చేసేందుకు ఒప్పించి గెలిపించుకుంటాం అని శపథం చేసారు.
పొత్తు పుణ్యమా అని బీజేపీ కి ఇవ్వబోయే స్థానాల్లో రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని సంఘటనలు ఎలాగూ తప్పవు.. ఇప్పటికే తెనాలి లో ఆలపాటి రాజా బదులుగా జనసేన నుండి నాదెండ్ల మనోహర్ కు టికెట్ కేటాయించినప్పుడు టీడీపీ క్యాడర్ నుండి సుతిమెత్తంగా తిట్లు తిన్నాడు బాబు. ఇక పిఠాపురం వ్యవహారం అయితే చెప్పే పనే లేదు. సొంత కార్యకర్తలే బాబు ను లోకేష్ ను నోటితో చెప్పుకోలేని బూతులు తిట్టారు.. పి గన్నవరం టికెట్ ను రాజేష్ కు కేటాయించినపుడు టీడీపీ క్యాడర్ నుండే కాకుండా జనసేన నుండి కూడా బాబు విపరీతమైన మాటలు భరించాల్సి వచ్చింది. ఇక తరువాయి భాగం “ఎచ్చెర్ల” దే కానుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది.. ఇప్పటికే టీడీపీ పోటీ చేయబోయే 144 స్థానాల్లో 139 స్థానాలను ప్రకటించిన టీడీపీ, పార్టీ పెట్టిన మొదటి నుండీ పార్టీ ని అంటిపెట్టుకుని ఉన్న కళా వెంకట్రావు సీటు ఎచ్చెర్ల కాగా ఆ సీటు నుండి పోటీ చేసే అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీ కి కేటాయించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అదే నిజం అయితే ఇన్నేళ్లు పార్టీ ని నమ్ముకుని ఉన్న కళా కు టికెట్ లేనట్లే.. అదే జరిగితే బాబుకు మరోసారి సొంత కార్యకర్తల నుండి వాయింపు తప్పదు…