చంద్రబాబు సీఎంగా పని చేసిన సమయంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో లెక్కే లేదు. కానీ ఆయన మాత్రం అన్నా హజారేనంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత బాబు ధనార్జనే ధ్యేయంగా అవినీతికి పాల్పడ్డారు. ఆయన హయాంలో పనిచేసిన కొంతమంది అధికారులను ఇందుకోసం ఉపయోగించుకున్నారు.
అప్పట్లోనే..
కండలేరు డ్యామ్ స్కామ్ ఆ రోజుల్లోనే తెలుగుదేశాన్ని ఓ కుదుపు కుదిపింది. దీనిపై అప్పట్లో పత్రికల్లో అనేక కథనాలు కూడా వచ్చాయి. కండలేరు డ్యాం.. ఇది శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలంలో ఉంది. తెలుగు గంగ ప్రాజెక్టులో భాగం ఇది. చెన్నైకి ఇక్కడి నుంచి నీరు వెళ్తుంది. కండలేరు హెడ్ రెగ్యులేటర్, పవర్ సూయీస్ల నిర్మాణానికి 1992 సంవత్సరంలో శ్రీకారం చుట్టారు. మూడు సంవత్సరాల్లో అంటే 1995 నాటికి పనులు పూర్తి చేయాలి. అయితే 1997లో కానీ పూర్తికాలేదు. 1992 నుంచి పనులు జరగకపోగా ఏదో కారణం చూపుతూ ప్రతిసారీ ఎస్టిమేషన్లు పెంచుకుంటూ రూ.18 కోట్ల పనిని రూ.36 కోట్లకు చేర్చారు. 95లో ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్న చంద్రబాబు హయాంలో ఇదంతా జరింది.
ఏం జరిగిందటే..
పనుల సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పెన్నానది నుంచి ఇసుక తేవాల్సి ఉండగా, పరిసర ప్రాంతంలో దొరికిన ’లింగబొమ్మరాయి’ జాతికి చెందిన ఇసుక లాంటి మట్టిని వినియోగించారు. ఈ పనులపై టెక్నికల్ డిపార్టుమెంట్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. అయితే పైనుంచి వచ్చిన ఒత్తిళ్లతో తెలుగుగంగ ఈఈగా రమువతి ఉన్నకాలంలో అదే ఇసుకను ఆ మోదించి పనులు కొనసాగించుకొనేందుకు అవకాశం కల్పించారు. కొంతపని జరిగిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు పనులను పరిశీలించారు. అక్కడ వాడుతున్న ఇసుక పనికిరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని పేర్కొన్నారు. కొంతకాలానికి ఆ ఇంజినీర్లు ఇద్దరూ బదిలీ అయిపోయారు. ఇంకా గ్రానైట్ వినియోగంలోనూ నిబంధనలను పట్టించుకోలేదు. ఖర్చు తగ్గుతుందని తెలుగుగంగ కాలువ తవ్వకాల్లో బయటపడిన మెటల్‌ను వాడారు. దీనినంతటిపై క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు. మొత్తం అవినీతి తంతు ఈఈ పర్యవేక్షణలోనే జరిగిందని ఆరోపణలు వెల్లవెత్తాయి. పనులన్నీ నాసిరకంగా జరిగాయని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని విజిలెన్స్ అధికారులు తమ నివేదికను అప్పటి సీఎంకు ఇచ్చాయి. అయితే అనూహ్యరీతిలో ఈఈ రఘుపతి బాబు సొంత జిల్లాలో ఎస్ఈగా పదోన్నతి పొందారు. ఈ వ్యవహారం ఆ శాఖ అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ స్కామ్‌లో చిన్న ఉద్యోగులపై బదిలీ వేటు వేయడం గమనార్హం.
పర్యావసానాలు
హెడ్ రెగ్యులేటర్, స్లూయిజ్‌ను డబ్బుకు కక్కుర్తి పడి బంకమన్నుతో, నాసిరకం మెటల్‌తో నిర్మించడంతో అనేక సమస్యలు తలెత్తాయి. చెన్నై మేయర్ ఎన్నికలకు ముందు కండలేరు నుంచి పూండీకి నీటిని విడుదల చేయగా అనుకున్న సమయానికి చేరలేదు. వెంకటగిరి, సత్యవేడు వద్ద కొద్దిపాటి ఒత్తిడికే లీకేజీ జరిగి గంగ జలాలు పొలాలను ముంచెత్తాయి. ఈ వ్యవహారాన్ని కప్పి పెట్టడానికి అర్ధరాత్రి సిమెంట్ పూతలు పూయాల్సి వచ్చింది. కాగా అనేక అంశాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తప్పు పట్టింది. అవకతవకలను ఎత్తిచూపుతూ ఇంజినీరింగ్ కమిటీని నియమించినా ఉపయోగం లేకుండాపోయింది. అప్పటి ప్రభుత్వం దీనికి పట్టించుకోలేదు. ఇదంతా ఆనాడు నెల్లూరు రాజకీయాల్లో దుమారం రేపింది. జెడ్పీ చైర్మన్‌పై కాంగ్రెస్ జెడ్పీటీసీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. బాబు అక్రమార్జన వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చినా ఎల్లో మీడియా పుణ్యాన పెద్దమనిషిలా తిరుగుతుంటారు. ఆయన సీఎంగా పనిచేసిన కాలంలో జరిగిన ప్రతి పనిలో అవినీతి చోటుచేసుకుంది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకుంటూ తిరిగాడు. ఆఖరికి పాపం పండి స్కిల్ స్కామ్ కేసులో జైలుకి వెళ్లాడు.