నా వాళ్లు అని జగన్ దళితులని అనుకోవడమే జగన్ దళిత ద్రోహి అని బాబు అనడానికి కారణమా? వాస్తవాలు ప్రజలంతా గమనిస్తున్నారు..
ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక క్రింద 14.54 లక్షల ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14.44 లక్షల ఎస్సీ కుటుంబాలకు (99 శాతం) సహాయం అందింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మందికి కూడా ఎస్సీ కుటుంబాలకు సాయం అందలేదు. దేశంలోని రాష్ట్రాలన్నీ కలిపి 14.39 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించగా అందులో సగం విద్యార్థులు (7.16 లక్షల మంది) ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక చెప్తుంది..
దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని పుట్టుక నే అవహేళన చేసిన బాబు 5 ఏళ్ల పాలనలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు రూ.35,250 కోట్లు కాగా, నా వాళ్లు అని జగన్ ఎస్సీల కోసం 4 ఏళ్లలో చేసిన ఖర్చు -రూ.63,689 కోట్లు అంటే దాదాపు రెట్టింపు.
మంత్రివర్గం లో బాబు దళితులకు కేటాయించిన మంత్రి పదవులు కేవలం రెండే, జగన్ మాత్రం 5 మంది దళితులను మంత్రులుగా చేయగా అందులో కూడా ముఖ్యమైన పోర్టుఫోలియో లు కేటాయించాడు, పైపెచ్చు బాబు కన్నా హోదా ఎక్కువ కలిగిన ఉపముఖ్యమంత్రి పదవి దళితులకు కేటాయించాడు.. ఇక కార్పొరేషన్ పదవులు విషయానికి వస్తే బాబు 4 కార్పొరేషన్ పదువులు ఇవ్వగా, జగన్ 15 కార్పొరేషన్ పదువులు ఇచ్చాడు. శాసన మండలి చైర్మన్ గా మోషెన్ రాజు ని నియమించి దళితులకు గౌరవం అందించాడు..
రాజధాని ప్రాంతలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మా కుల పెత్తనం దెబ్బ తింటుందని చంద్రబాబు అడ్డుకున్నాడు. రాజధాని లో కేవలం తన కులానికి చెందిన వారి అజమాయిషీ ఉండాలన్నది బాబు ఉద్దేశ్యం..
దళితులూ మీకెందుకురా రాజకీయాలు నా కొ…..రా రాజకీయాలు అంటే మేము చేయాలని టీడీపీ MLA చింతమనేని చౌదరి అన్నా కూడా కనీస మందలింపు కూడా లేకపోగా దాని తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అదే మాట వైసీపీ లో ఎవరైనా అని ఉంటే జగన్ నిర్దాక్ష్యిన్యంగా వారిని పార్టీ నుండి వెళ్లగొట్టేవాడు…
అమరావతిలో రూ.4 వేల కోట్ల విలువ చేసే 1,072 ఎకరాల అసైన్డ్ భూములను, మీ భూములు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి చీప్‌గా ఎకరం 5 లక్షలకు కొని మోసం చేసారు బాబు అండ్ కో.
తరువాత బాబు ప్రభుత్వం మిగిలిన జరీబు భూముల్లాగే అన్ని రాయితీలు ఇచ్చింది. జగన్ వచ్చాక అసైన్డ్ భూములు లాక్కున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, అసైన్డ్ భూముల అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చట్టం చేశాడు.
కాంట్రాక్టుల్లో, నామినేటెడ్ పదవుల్లో 50% ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ లకే కేటాయించేలా 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చట్టం చేసి మరీ వారికి పదవులు, కాంట్రాక్టులు ఇచ్చాడు. దీన్ని మార్చడానికి ఎవరూ సాహసించలేనంత గా ఓ గొప్ప అడుగు వేసింది జగన్ మాత్రమే..
అయినా సొంత మేనత్తల భర్తలు ఎస్సీ లు గా కలిగి ఉన్న జగన్, ధైర్యంగా, గర్వంగా నా మేనమామలు దళితులు అని చెప్పుకునే జగన్ ఎక్కడ? దళితుల పుట్టుక ని హేళన చేసే బాబు ఎక్కడ? దళితులు సంఘటితం అవ్వకుండా వారిలో వారికి కలహాలు శృష్టించి, వారిని కూడా కులాల వారీగా విడగొట్టే ఎస్సీ విభజన అనే వికృత చర్య చేపట్టిన బాబు దళిత ద్రోహి అవుతాడు గానీ, జగన్ దళిత ద్రోహి ఏ విధంగా అవుతాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది..