మొత్తానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సంయుక్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కానీ ఇందులో భారతీయ జనతా పార్టీ కనిపించలేదు. దీనికి టీడీపీ అధినేత ‘వాళ్లు రాష్ట్రాల వారీగా మేనిఫెస్టోను విడుదల చేయడం లేదు. దేశం మొత్తానికి ఒకటే ఉంటుంది’ అని చెప్పాడు. కానీ కవర్ చేసుకోవడానికే ఈ మాటలు అన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
సిక్కింలో 32 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో బీజేపీ పోటీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ, స్థానాల్లో బరిలో నిలిచింది. ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్ర పార్టీ వేర్వేరుగా మేనిఫెస్టోలు విడుదల చేసింది. విక్సిత్ భారత్ సంకల్ప్ పత్ర్ – 2024గా పేరు పెట్టింది. ఈ విషయం చంద్రబాబుకు తెలుసే ఉండొచ్చు. కానీ వారిది ఒకటే మేనిఫెస్టో ఉంటుందని మీడియా ముందు అబద్ధం చెప్పేశాడు. దీంతో సోషల్ మీడియాలో బాబుకు కౌంటర్లు పడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల మేనిఫెస్టోలు పెట్టి ఇవేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
2014లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చాయి. కానీ 2024కు వచ్చేసరికి అది జరగలేదు. దీంతో కాషాయం పార్టీకి తెలుగుదేశంతో పొత్తు పూర్తిగా ఇష్టం లేదని, ఏదో మొక్కుబడిగా కూటమిలో ఉందనే ప్రచారం సాగుతోంది. మేనిఫెస్టో విడుదల సమయంలో పొత్తులోని పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కానీ బాబు అలా ఏమీ లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.