జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పక్కాగా అమలు చేస్తున్న ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకాన్ని అదో దండగ పని అని, రేషన్ షాపుల వద్దకే ప్రజలు వెళ్లి రేషన్ తీసుకోవడం మంచిదని విమర్శించిన బాబు, 1995 లో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా ప్రజలను ఏమార్చేందుకు ఇచ్చిన ఒకానొక హామీ “ఇంటి వద్దకే రేషన్ బియ్యం” …. బాబు గురించి తెలిసిందేగా యధావిధిగా ఎన్నికలు ముగిశాక ఆ విషయాన్ని మరచి ఇంటివద్దకే రేషన్ సంగతి దేవుడెరుగు రెండు రూపాయలకే కిలో బియ్యం ధర అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు…
ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం లో బాబు ని మించినవారు ఉండరు. అధికారంలోకి రాగానే ఆ హామీలు గల్లంతు అవుతాయి, ఒకవేళ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం బాబు చేయలేని పని చేసి చూపిస్తే, ఒకటి గతంలో తను ఇచ్చిన మాట అని మర్చిపోయి అది దండగ అయినా అంటాడు, లేదా ఆ గొప్ప ఆలోచన నాదే తమ్ముళ్లూ అని అయినా అంటాడు…
ఇలాగే వాలంటీర్ల వ్యవస్థ దండగ అనీ, వాలంటీర్లు ఇంట్లో ఎవరు లేని సమయంలో దూరి దొంగతనాలకు, మానభంగాలకు పాల్పడుతున్నారు అనీ నీచమైన వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు అధికారంలోకి వస్తే వాలంటీర్లను జైలుకు పంపుతా అంటున్నాడు.. రేపొద్దున మళ్లీ మాట మార్చి వాలంటీర్ల ఆలోచన నాదే, అది నా బ్రెయిన్ చైల్డ్ అని ప్రకటించుకున్నా ఆశ్చర్యం లేదు…